BIG TV LIVE Originals: భారతీయ రైల్వే ప్రయాణీకులకు జర్నీ ఖర్చులు తగ్గించేలా చాలా ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నది. టికెట్ ఛార్జీలతో పాటు ఫుడ్ ఆర్డర్లపైనా ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తుంది. వీటి గురించి చాలా మంది ప్యాసింజర్లకు తెలియక ఉపయోగించుకోవడం లేదు. ఇంతకీ రైల్వే అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
⦿ రైల్‌యాత్రి ఆఫర్: రైల్‌యాత్రి అనేది IRCTC ఆఫర్. తొలిసారి IRCTC యాప్ ఉపయోగించే వినియోగదారులకు రూ.50 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2025 వరకు అందుబాటులో ఉంటుందని IRCTC ప్రకటించింది. మొబైల్ నంబర్ OTP ద్వారా వెరిఫై చేసిన లాగిన్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
⦿ రెడ్ రైల్: రెడ్ రైల్ యాప్ లో SUPER60, SUPERB60 కూపన్ కోడ్‌లను ఉపయోగించి రూ.30 డిస్కౌంట్, రూ.30 క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. అంటే, మొత్తం రూ.60 తగ్గింపు లభిస్తుంది. UPI ద్వారా చెల్లింపు చేస్తే సర్వీస్ ఛార్జీలు కూడా ఉండవు.
⦿ ఇక్సిగో: UPI చెల్లింపులపై ఇక్సిగో జీరో పేమెంట్ గేట్ వే ఫీజుతో పాటు డెబిట్/క్రెడిట్ కార్డ్ లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. తత్కాల్ టికెట్ బుకింగ్ ఈ యాప్ లో అందుబాటులో ఉంది.
⦿ అమెజాన్: అమెజాన్ లో రైల్వే టికెట్ బుకింగ్ పై ప్రైమ్ మెంబర్లకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా ఇన్ స్టంట్ రిఫండ్ అమెజాన్ పే బ్యాలెన్స్‌లోకి జమ అవుతాయి.
⦿ పేటీఎం: పేటీఎం ద్వారా టికెట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ స్టేషన్ ఫీచర్ ద్వారా కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం పెరుగుతుంది.
⦿ IRCTC టూరిజం ప్యాకేజీలు: IRCTC టూరిజం ద్వారా రామాయణ టూర్, మాతా వైష్ణో దేవి దర్శనం, జ్యోతిర్లింగ యాత్ర లాంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలలో ట్రావెల్, అకామొడేషన్ కలిపి ఉంటాయి.
⦿ స్టూడెంట్ డిస్కౌంట్లు: ఇండియన్ రైల్వే విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తోంది. రీసెర్చ్ స్టూడెంట్లకు టికెట్ పై 50% డిస్కౌంట్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, స్టడీ టూర్ కోసం వెళ్తే 75% డిస్కౌంట్ అందిస్తోంది.
⦿ సీనియర్ సిటిజన్ డిస్కౌంట్: 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40%, 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వందే భారత్, గరీబ్ రథ్ వంటి రైళ్లలో ఈ ఆఫర్ వర్తించదు.
⦿ BHIM UPI ఆఫర్: BHIM UPI యాప్ ద్వారా చెల్లింపు చేస్తే 5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
⦿ ఫుడ్ ఆర్డర్ డిస్కౌంట్లు: రైల్లో ఫుడ్ ఆర్డర్ పై గ్రాబ్ ఆన్ రూ.50 డిస్కౌంట్ అందిస్తుంది. అయితే, కనీసం రూ.200 ఆర్డర్‌చేయాల్సి ఉంటుంది.
ఈ ఆఫర్లు సీజనల్ గా మారుతూ ఉంటాయి. బుకింగ్ చేసేటప్పుడు తాజా ఆఫర్లను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. IRCTC వెబ్ సైట్, రైల్ యాత్రి, రెడ్ రైల్, ఇక్సిగో, పేటీఎం లాంటి ప్లాట్ ఫామ్ లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: భారత్-భూటాన్ మౌంటైన్ టూర్, ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?