Bigg Boss 10:బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో వివిధ భాషలలో పలు సీజన్లు పూర్తి చేసుకొని, ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతోంది. ఇకపోతే తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తికాగా, పదవ సీజన్ కూడా ప్రారంభమై అప్పుడే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ఇకపోతే నామినేషన్ లో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాగ్వాదం మాటల దాడి అందరినీ ఆలోచింప చేస్తోంది. కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ విజేత అవుతాడని ఒక వర్గం చెబుతుంటే.. మరొకవైపు తనదైన ఆట తీరుతో ఫర్ఫెక్ట్ గేమర్ గా పేరు సొంతం చేసుకున్న త్రిగుణ్ విజేత అవుతారు అంటే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే నామినేషన్ లో భాగంగా రోహిత్ (Rohit ), త్రిగుణ్(Trigun ) ను అన్న మాటలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఇవే మాటలపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ (Geethu) ఏకీభవిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ఒకవైపు యాంకర్ గా మరొకవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌గా తనదైన పాపులారిటీ సొంతం చేసుకున్న గీతూ రాయల్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈమె బిగ్ బాస్ రివ్యూయర్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్ల గురించి, ఆట గురించి రివ్యూ ఇస్తూ ఆడియన్స్ లో మంచి పేరు దక్కించుకున్న ఈమె.. తాజాగా బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోంది అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
గీతూ రాయల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. ఈరోజు రోహిత్ ఏదైతో చెప్పాడో అది పర్ఫెక్ట్. రోహిత్ కి కూడా తెలుసు బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా చేస్తున్నాడు అని. మరి రోహిత్ చెప్పిన పాయింట్ ఏంటంటే..” నువ్వు మాట్లాడినట్లు నేను మాట్లాడి ఉంటే.. నువ్వు బిహేవ్ చేసినట్టు నేను బిహేవ్ చేసి ఉండుంటే, ఇప్పటికి నాకు రెండు మూడు యెల్లో కార్డ్స్ వచ్చి ఉంటాయి” అని అన్నాడు. రోహిత్ ఏ విధంగా అయితే తన మాటలను బయటపెట్టాడో అతడు చెప్పింది అక్షర సత్యం. త్రిగుణ్ బిహేవ్ చేసినట్టు రోహిత్ బిహేవ్ చేసి ఉండుంటే కచ్చితంగా ఈ పాటికి రెడ్ కార్డ్ వచ్చి బయటకు వెళ్లిపోయేవాడు.
also read:అరియానాపై బాబా భాస్కర్ ఫైర్.. నువ్వు చెప్పక్కర్లేదు అంటూ!
త్రిగుణ్ కాబట్టి మొత్తం బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోంది కాబట్టి నాగ్ మావ, అసిస్టెంట్ డైరెక్టర్ త్రిగుణ్ ఫేవర్ కాబట్టి అతడు చెప్పినట్టే నడుస్తోంది. అదొక పనిష్మెంటా.. బొచ్చులో పనిష్మెంట్.. ఆ చేతులకు సంకెళ్లు ఏంటి. ఆ చేతులకు సంఖ్యలు వేశారు ఓకే.. ఎక్కడో ఒకచోట కట్టేయాలి కానీ అలా వదిలేయడం ఏంటి? నిజంగా చెబుతున్నాను బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్‌గా నడుస్తోంది అంటూ తన మాటగా చెప్పుకొచ్చింది గీతూ. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.