Virender Sehwag On Jersy Number: టీమిండియా ( Team India) మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు సిక్సర్లు బౌండరీలు గొడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. అయితే, అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్లో జెర్సీ నెంబర్ కోసం నిత్యం గొడవ అయ్యేదట. తన తల్లి ఒక జెర్సీ నెంబర్ సెలెక్ట్ చేయగా… భార్య మరో నెంబర్ సెలెక్ట్ చేసి వేసుకోవాలని గొడవపడేదట. ఈ ఇద్దరి గొడవ భరించలేక, జెర్సీ నెంబర్ లేకుండానే బరిలోకి దిగినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ) తన కెరీర్ ప్రారంభంలో 44 జెర్సీ నెంబర్ ను తాను ధరించేవాడు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ 46 నెంబర్ జెర్సీని ధరించాడు. 2005 సమయంలో ఫామ్ సరిగ్గా లేదని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు దగ్గరికి తన తల్లి వెళ్లినట్టు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. ఈ సందర్భంగా 46 జెర్సీ నెంబర్ ధరించాలని ఆ జ్యోతిష్యుడు సలహా ఇచ్చినట్టు గుర్తు చేశారు. దీంతో తల్లి సూచనల మేరకు కొత్త జెర్సీతో బరిలోకి దిగినట్టు పేర్కొన్నారు. కానీ ఆటలో మార్పు రాలేదని వివరించారు. దీంతో తన ఫ్యామిలీ మొత్తం నిరాశ చెందినట్టు తెలిపారు.
ఆ తర్వాత కొన్ని జ్యోతిష్య పుస్తకాలను తన సతీమణి ఆర్తి చదివి..నెంబర్ 2 జెర్సీని సెలెక్ట్ చేసినట్టు పేర్కొన్నారు. అదే తనకు లక్కీ నెంబర్ గా మారుతుందని ఆమె చెప్పడంతో… రెండో నెంబర్ జెర్సీని వేసుకోవడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. అయినా కూడా వర్కౌట్ రాలేదని తెలిపారు. దీంతో తన భార్య ఆర్తి, తల్లి మధ్య పెద్ద గొడవ జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక ఈ గొడవ నేపథ్యంలో ఒక మ్యాచ్ లో తల్లి సెలెక్ట్ చేసిన జెర్సీని ధరించే వాడినని… మరో మ్యాచ్ లో భార్య ఫైనల్ చేసిన జెర్సీని వేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కానీ ఐసీసీ రూల్స్ ప్రకారం ఏదో ఒక జెర్సీ ధరించాలని ఆ తర్వాత కొత్త రూల్స్ వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో భార్య తల్లి మధ్య గొడవ పెట్టడం ఇష్టం లేక జెర్సీ నెంబర్ లేకుండానే బరిలోకి దిగానని వ్యాఖ్యానించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.