BigTV English
Advertisement

MMTS: ద్యావుడా.. క్యాబ్‌కు రూ.1000, బస్సులో వెళ్తే రైల్ మిస్.. MMTS మాటేంటీ?

MMTS: ద్యావుడా.. క్యాబ్‌కు రూ.1000, బస్సులో వెళ్తే రైల్ మిస్.. MMTS మాటేంటీ?

MMTS: హైదరాబాద్ నగర శివార్లలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఉంది. తెలంగాణలో ఇదే మొదటి రైల్వే టెర్మినల్. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే రూ.428 కోట్లు ఖర్చు చేసి ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. గూడ్స్ రైళ్లు కూడా ప్రయాణించే విధంగా దీన్ని నిర్మించినట్టు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి 24 రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.


ఇంత వరకు బాగానే ఉంది. సిటీలో ఉన్న మిగతా రైల్వే స్టేషన్‌లలో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ బాగానే హెల్ప్ చేస్తుందేమో. కానీ, ఇంత పెద్ద సిటీలో ఎక్కడెక్కడో ఉండే తాము నగర శివార్లలో ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఎలా చేరుకోవాలని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచే వళ్తారు. అయితే చర్లపల్లి వెళ్లడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో సామాన్యుడి నెత్తి మీద అదనపు భారం పడుతోంది.

ALSO READ: రైల్వే తాత్కాల్ టైమింగ్స్  మారనున్నాయా..?


చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు చేరుకోవాలంటే విపరీతంగా ఖర్చు అవుతోందని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లికి వెళ్లాలంటే ఎంఎంటీఎస్ సర్వీసులు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. కార్లు బుక్ చేసుకొని, ఆటోలు మాట్లాడుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే రూ. వేలలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. అయితే సిటీలోని కొండాపూర్, చింతల్, కూకట్‌పల్లి వంటి ప్రాంతల నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రైవేట్ వాహనాలలో వెళ్లాంటే ట్రైన్ టికెట్ కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.

దీని వల్ల మద్య తరగతి వాళ్లపై ఎక్కువ భారం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. నగర శివార్లలో ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు చేరుకోవాలంటే ట్రైన్ టైం కన్నా 3 గంటల ముందే బయలుదేరాల్సి వస్తుందని అంటున్నారు. రోడ్లు రద్దీగా ఉండే సమయాల్లో అయితే ట్రాఫిక్ కారణంగా ట్రైన్ మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. టెర్మినల్‌ నుంచి రైళ్లను నడపాలని నిర్ణయించుకున్నప్పుడు.. అక్కడికి చేరుకోవడానికి సరైన సౌకర్యాలు కూడా ఉండేలా చేయాలి కదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

చర్లపల్లికి ఎంఎంటీఎస్ సేవలు ఎక్కువగా లేకపోవడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలని ప్రయాణికులు కోరతున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఎంఎంటీఎస్ సేవలు సక్రమంగా అందేలా చేయాలని అంటున్నారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా టెర్మినల్‌కు వెళ్లొచ్చని అంటున్నారు.

Related News

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Amazon Pay Offers: రూ.3వేలలోపే గోవా ట్రిప్, బుకింగ్‌లు స్టార్ట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు..

Big Stories

×