BigTV English

Dhoni – Ruturaj : గాయం పేరుతో కుట్రలు… రుతురాజు కెరీర్ నాశనం చేసిన ధోని

Dhoni – Ruturaj : గాయం పేరుతో కుట్రలు… రుతురాజు కెరీర్ నాశనం చేసిన ధోని

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను తప్పించడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గాయం కారణం చెప్పి అతడిని కావాలనే తొలగించారని కొందరూ విమర్శిస్తున్నారు. అసలు రుతురాజ్ కి గాయమే కాలేదని.. ఫుట్ బాల్ కూడా ఆడుతున్నాడని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో పాతదని.. ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడమే మంచిదని మరికొందరూ కామెంట్స్ చేయడం విశేషం. 


మహేంద్ర సింగ్ ధోని మరో సారి చెన్నై జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గువాహటిలో గత నెల 30న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా.. రుతురాజ్ మోచేతికి గాయం అయింది. కానీ నొప్పి తీవ్రం కావడంతో పరీక్షలు చేయగా మోచేతికి ప్రాక్షర్ అయినట్టు తేలిందని సమాచారం. ఇవాళ కేకేఆర్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. అయితే కెప్టెన్ పగ్గాలు ఎం.ఎస్. ధోనీ చేపట్టనున్నాడు. సొంత మైదానంలో చెపాక్ జరిగే మ్యాచ్ సందర్భంగా ధోని విధుల్లో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ముందుగా వాటిని సరిచేయాలన్నారు. రుతురాజ్ లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో మీరు భర్తీ చేస్తారు..? ఈ లోటును ఎలా పూడ్చుకుంటారని.. ఫామ్ లో ఉన్న బ్యాటర్ ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

ఓపెనర్ రచిన్ రవీంద్ర ప్రారంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో రుతురాజ్ లాంటి బ్యాటర్ లేకుండా ఎలా ముందుకు వెల్లగలరు అని రాబిన్ ఊతప్ప సీఎస్కే యాజమాన్యాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.  వాస్తవానికి గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ ను ప్రకటించాడు. రుతురాజ్ సార్థ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతుంది. ఐపీఎల్ 2024లో రుతురాజ్ సేన పద్నాలుగు మ్యాచ్ లకు ఏడు గెలిచింది. ఆర్సీబీతో కీలక మ్యాచ్ లో ఓడీ ప్లే ఆప్స్ కి చేరకుండానే ఇంటి బాటపట్టింది. చెన్నై టీమ్ కి ధోనీ ఇప్పటి వరకు దాదాపు 235 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహారించాడు. 5 సార్లు జట్టు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. 2022లో ధోనీ స్థానంలో రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్ గా ఎంపిక చేసింది.


 

 ఇక టోర్నీ మధ్యలో అతడు 8 మ్యాచ్ ల తరువాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనీనే మళ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. 2024 సీజన్ నుంచి రుతురాజ్ గైక్వాడ్ కి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఆ తరువాత మిగతా మ్యాచ్ లు ఓడిపోయింది. చెపాక్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై హ్యాట్రిక్ మ్యాచ్ లు ఓడిపోతుందా.? లేక ధోనీ కెప్టెన్సీలో కేకేఆర్ ని మట్టి కరిపిస్తుందా..? అనేది తెలియాలంటే కొద్ది సేపు వేచి చూడాల్సిందే. 

 

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×