Tatkal Booking Timings: అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారి కోసం తత్కాల్ టికెట్స్ ను అందుబాటులో ఉంచుతుంది భారతీయ రైల్వే సంస్థ. ప్రయాణానికి ఒక్క రోజు ముందు తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ కు అవకాశం కల్పిస్తుంది. అయితే, ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఇండియన్ రైల్వే స్పందించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేదని వెల్లడించింది. తత్కాల్ టైమింగ్స్ మారుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది.
తత్కాల్ బుకింగ్ అంటే ఏంటి?
ఎమర్జెన్సీ ప్రయాణం చేసేవారి కోసం ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ప్రత్యేక టికెట్ బుకింగ్ వ్యవస్థ. ఈ టికెట్లను రైలు బయల్దేరడానికి ఒక రోజు ముందు మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, ఈ టికెట్స్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. తత్కాల్ టికెట్స్ పొందడం చాలా కష్టం.
ప్రస్తుత తత్కాల్ బుకింగ టైమింగ్స్
తత్కాల్ టికెట్ బుకింగ్స్ లో సమయాల్లో ఎలాంటి మార్పు లేదని భారతీయ రైల్వే సంస్థ వివరణ ఇచ్చింది. ఏసీ క్లాస్ లకు (2A, 3A, CC, EC, 3E) సంబంధించిన తత్కాల్ టికెట్స్ బుకింగ్ అనేది, రైలు బయల్దేరడానికి ఒక రోజు ముందు ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. కొద్ది సేపట్లోనే ఈ టికెట్స్ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక నాన్ ఏసీ క్లాస్ (స్లీపర్, 2S, FC) లకు సంబంధించిన బుకింగ్ రైలు బయల్దేరడానికి ఒక రోజు ముందు ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడు అవుతాయి. తత్కాల్ టికెట్స్ బుకింగ్ కు సంబంధించిన టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు వెల్లడించారు. మార్పు వార్తలను ప్రయాణీకులు పట్టించుకోకూడదని తెలిపారు.
ఇదీ అసలు సంగతి!
తత్కాల్ టికెట్స్ బుకింగ్ టైమింగ్స్ మారకపోయినప్పటికీ, ఆన్ లైన్ బుకింగ్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేసింది ఇండియన్ రైల్వే. ఫిబ్రవరి 15 నుంచి IRCTC వెబ్ సైట్, యాప్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని యాడ్ చేస్తున్నారు. వీటి ద్వారా ప్రయాణీకులకు మరిన్ని లాభాలు కలగనున్నాయి.
Read Also: సమ్మర్ కి టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఏపీకి 24 స్పెషల్ రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!
AIతో లాభాలు ఏంటి?
⦿ వేగవంతమైన టికెట్ బుకింగ్
⦿ తక్కువ వెబ్ సైట్ క్రాష్ లు
⦿ సురక్షితమైన లావాదేవీలు
⦿ నకిలీ, బాట్ బుకింగ్ లను ఆపడం
సో, తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. గతంలో మాదిరిగానే బుక్ చేసుకోవచ్చు. టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు లేవు. రైల్వేకు సంబంధించిన కొత్త విషయాల గురించి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ను చెక్ చేస్తూ ఉండండి.
Read Also: ఈ కార్డ్స్ తో టికెట్స్ కొంటే ఇన్ని లాభాలా? ఈసారి అస్సలు మిస్ కాకండి!