BigTV English

Women’s schemes in TG: ఆడబిడ్డల అభ్యుదయమే లక్ష్యంగా.. రేవంత్ సర్కార్ అడుగులు, ఈ పథకాలన్నీ మహిళల కోసమే!

Women’s schemes in TG: ఆడబిడ్డల అభ్యుదయమే లక్ష్యంగా.. రేవంత్ సర్కార్ అడుగులు, ఈ పథకాలన్నీ మహిళల కోసమే!

ప్రతి మహిళ సాధికారత ఆత్మవిశ్వాసంతోనే మొదలవుతుంది. మరి ఆ ఆత్మవిశ్వాసాన్ని కల్పించేదెవరన్న ప్రశ్నల నుంచి తానే ముందుంటానంటూ జవాబుగా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు కొంచెం చేయూత ఇవ్వాలే గానీ వారు అద్భుతాలు సృష్టించగలరని నమ్మి అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తన ఆలోచనలను అమలు పరుస్తూనే ఉన్నారు. వారు ఊహకందని పనులు చేస్తున్నారు.


సీఎంగా పగ్గాలు చేపట్టగానే…

సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన మూడు రోజులకే ఇది జరిగింది. యశోదా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌‌ను పరామర్శించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లారు. సీఎం వస్తున్నారని చెప్పి హాస్పిటల్ లో ఉన్న పేషంట్ల అటెండెంట్లను ఎక్కడికక్కడ సిబ్బంది ఆపేశారు. ఓ యువతి మాత్రం సీఎంను చూసి రేవంతన్నా అని గట్టిగా పిలిచింది. నిజానికి సీఎం స్థాయి వ్యక్తి అలా ఎవరైనా పిలవగానే పలకాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క పిలుపుతో వెనక్కి తిరిగి చూసి ఆమె దగ్గరకు వెళ్లారు. హాస్పిటల్ బిల్లు గురించి చెప్తే బాధపడొద్దని ధైర్యంగా ఉండాలని ఆ అమ్మాయికి సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ ఒక్క పనితో ఆడబిడ్డల మనసుల్లో చెరగని ముద్ర వేశారు సీఎం. అందరికీ సీఎం.. ఆడబిడ్డలకు మాత్రం రేవంతన్నగా ఉండడమే ఇష్టం. లీడర్ అంటే స్థాయిని బట్టి మారిపోయేలా కాదు.. ఏ స్థాయిలో ఉన్నా తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటానని ఈ చర్యతో నిరూపించారు. ఆ నాడు నువ్వు సూపర్ అన్నా.. అంటూ ఆడబిడ్డలు ఆకాశానికెత్తేశారు.


చెప్పారు.. చేసి చూపిస్తున్నారు

2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల నుంచే ఆడబిడ్డల కోసం ఏమేమి చేయగలనో.. చెప్పుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం అయ్యాక తన ఆలోచనలను వరుసగా అమలు చేస్తున్నారు. మహిళల పాత్ర ఇంటికే పరిమితం కాదు, ఆమే ఒక లీడర్. మార్పును సృష్టించే వ్యక్తి అని నమ్మారు. మహిళలు తలచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలిగే శక్తి వారికి ఉంటుందని, ఆ శక్తిని గుర్తించి వారికి ప్రోత్సాహం కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేయించారు.

కోటీశ్వరులను చెయ్యడమే లక్ష్యంగా..

ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ బాగుంటేనే ఇల్లు పిల్లలు, ఆ కుటుంబం బాగుంటాయన్నది సీఎం నమ్మకం. అక్కచెళ్లెళ్లు కోటీశ్వరులైతే రాష్ట్ర స్వరూపమే మారిపోతుందన్నది సీఎం నమ్మిన సిద్ధాంతం. గతంలో ప్రచారాల దగ్గర్నుంచి ఇప్పుడు మహిళా సంఘాలతో సమావేశాల దాకా నోరారా అక్కా అక్కా అని పిలిచిన రేవంత్.. వారిని ఇప్పుడు ఆర్థికంగా ఒక మెట్టు కాదు పది మెట్లు పైకి ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి అడుగు మహిళాభ్యుదయం కోసమే. ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత మహిళలకే అని సీఎం పదేపదే అంటున్నారంటే ఆ ప్రయారిటీ అర్థం చేసుకోవచ్చు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించడమే వారి అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.

ఒక అన్నగా.. తమ్ముడిగా భరోసా..

ఇంట్లో మహిళలు సంతోషంగా ఆ ఇల్లు బాగుంటుంది. ఈ సిద్ధాంతాన్ని డే వన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే ఏ పనైనా, వ్యాపారమైనా, చివరికి ఇందిరమ్మ ఇల్లైనా మహిళల చేతికే పగ్గాలిస్తున్నారు. ఏ ఊరు వెళ్లినా వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమంటున్నారు. ఇంట్లో సొంత అక్కచెళ్లెల్లను అన్నదమ్ములు ఎలా చూసుకుంటారో.. అంతకంటే ఎక్కువగా చూసుకోవాలని సీఎం రేవంత్ ప్రతిక్షణం తాపత్రయ పడుతున్నారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా వారికి భరోసా ఇస్తున్నారు. అక్కచెళ్లెళ్లంతా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ఆశయంగా పెట్టుకున్నారు. ఇందులో గ్రామీణం, పట్టణ ప్రాంతమన్న తేడా లేదు. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే. అందరినీ సమానంగానే చూస్తున్నారు.

సీఎంగా కాదు.. అన్నగా చూస్తున్న మహిళలు

రేవంతన్నా అని పిలిచిన చెల్లెల్ని పెడచెవిన పెట్టలేదు. (యశోద హాస్పిటల్ సీన్) చదువుకునే రోజుల్లో రెంట్ కు ఉన్న ఇంటి ఓనర్ అక్కను మర్చిపోలేదు (వనపర్తి పార్వతమ్మ). అదే ఆప్యాయత. అదే కలుపుగోలుతనం. పెద్ద పెద్ద పదవులు రాగానే జనాన్ని పక్కన పెడుతున్న రోజులివి. కానీ రేవంత్ మాత్రం గ్రౌండ్ రియాల్టీ మర్చిపోలేదు. ఏ సభలకు వెళ్లినా నోరారా అక్క చెల్లె అని పిలవడమే కాదు.. వారికి ఇచ్చే ప్రయారిటీనే వేరు. ఏ ఊరుకెళ్లినా మహిళలకు ఏదో ఒక బెనిఫిట్ చేస్తూనే ఉన్నారు. మహిళలు కూడా సార్ అని, సీఎం అని పిలవడం కాదు.. సొంత మనిషి మాదిరి రేవంత్ అని డైరెక్ట్ గా పిలిచేంత పరిస్థితి.

కమిట్మెంట్.. సింప్లిసిటీకి చిరునామా..

సింప్లిసిటీకి కేరాఫ్. సీఎం అన్నట్లుగా ఎక్కడా హావభావాలు ఉండవ్. హంగూ ఆర్భాటాలుండవ్. ఏ జిల్లాకెళ్లినా.. ఎక్కడ బహిరంగ సభ పెట్టినా మహిళా సంఘాలతో ప్రత్యేకంగా మీటింగ్ ఉండాల్సిందే. ఆ మీటింగ్ ఎలా ఉంటుందంటే.. ఇంట్లో అన్నా చెల్లెల్లు, అక్క తమ్ముడు ఎలా మాట్లాడుకుంటారో అచ్చంగా అలానే ఉంటుంది. మచ్చుకు ఈ మీటింగ్ చూడండి.. సరదాగా నవ్వులు. అక్కా అక్కా అని పిలుపులు. ఇదీ కమిట్ మెంట్ అంటే. ఇదీ సింప్లిసిటీ అంటే. అక్క చెళ్లెళ్ల మొఖాల్లో చిరునవ్వులు చూడడమే కాదు.. వారిని కోటీశ్వరులను చేసే లక్ష్యం సీఎం రేవంత్ ది. మాటలే కాదు.. చేతల్లో ఏమేం చేయాలో కూడా చూపిస్తున్నారు.

బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన వాటిని మూడు రోజుల్లోనే పట్టాలెక్కించారు సీఎం రేవంత్. అందులో కీలకమైంది మహాలక్ష్మి పథకం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఈ లబ్ది పొందారు. టిక్కెట్ కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇది పేద, మధ్యతరగతి మహిళలకు చాలా ఉపయోగపడింది. తక్కువ వేతనాలకు పని చేస్తున్న వర్కింగ్ వుమెన్స్ పాలిట కల్పతరువైంది. బస్ పాస్ కోసం పెట్టే ఆ రెండు మూడు వేల రూపాయలు తమ పిల్లల ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఇది చాలదా ఒక నిర్ణయం ఎంత ఎఫెక్ట్ గా ఉంటుందో చూపడానికి. అంతే కాదు.. వెయ్యిదాటిన గ్యాస్ సిలిండర్ ను 500కే ఇప్పిస్తున్నారు. సో ఏ పని చేసినా మొదట మహిళాభ్యుదయం కోసమే సీఎం అడుగులు ఉంటున్నాయి.

తక్కువ వడ్డీకే రుణాలు..

మహిళలకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి.. వారిని వ్యాపార రంగంలో ముందుకు తీసుకెళ్లాలి. పొదుపు సంఘాలైతే తక్కువ వడ్డీలకే రుణాలు ఇప్పించాలి. ప్రతి పనిలో సబ్సిడీలు ఇవ్వాలి. వారిని ఒక మెట్టు కాదు.. పది మెట్లు ఎక్కించాలి.. సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలి. ఇదే సీఎం రేవంత్ లక్ష్యం. ఆ దిశగా ముందడుగైతే పడింది.

రూ.1000 కోట్లతో క్వాలిటీ చీరలు..

రాష్ట్రంలోని మహిళా సంఘాలలోని ప్రతి సభ్యురాలికి ఏడాదికి రెండు క్వాలిటీ చీరలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళా సమాఖ్య సభ్యులు ఉన్నారు. సొంత ఆడ బిడ్డలకు ఎలాంటి చీరలు అయితే ఇస్తారో.. 1000 కోట్లతో ఏడాదికి రెండు క్వాలిటీ చీరలను ప్రతి సమాఖ్య సభ్యురాలికి ఇస్తామని చెప్పడం కమిట్ మెంట్. అంతే కాదు.. మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవడం, శిల్పారామంలో మహిళలు తయారు చేసిన వస్తువులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేయడం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పని అప్పగించడం, మహిళా సంఘాలతో బస్సులు కొనిపించి ఆర్టీసీలో వినియోగించడం, మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు పెట్టించడం.., సోలార్ ప్లాంట్లు ఇలా ఒక్కటేమిటి.. ఏయే రంగాల్లో వ్యాపారాభివృద్ధి అవకాశాలు ఉన్నాయో అవన్నీ చేసి చూపిస్తున్నారు సీఎం. నిజానికి ఏ రాష్ట్రంలోనూ ఇలా మహిళల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి లేదు.

పూర్తిగా మహిళలతో నడిచే పెట్రోల్ బంక్..

నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో బీపీసీఎల్ సహకారంతో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటై, పూర్తిగా మహిళలచే నడిచే పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్ ఇటీవలే ప్రారంభించారు. అయితే కొందరు సీఎం లెవెల్ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ అని సోషల్ మీడియాల్లో విమర్శించారు. కానీ సీఎం ఉద్దేశం ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైంది. బంకులు నడుపుతున్న వారికి వస్తున్న బెనిఫిట్స్ తో ఆ మహిళా సమాఖ్య సభ్యుల కళ్లల్లో ఆనందం రెట్టింపవుతోంది. అందుకే ఇలాంటి విమర్శలు ఎన్ని ఎదురైనా మహిళల ఆత్మీయత చాలు అన్న సంతృప్తితో ముందుకెళ్తున్నారు సీఎం.

10,490 మందికి కుట్టు మిషన్లు

ఇటీవలే వనపర్తి జిల్లాలో స్టేట్​ మైనారిటీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కుట్టు మిషన్​ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 10 వేల 490 మందికి కుట్టు మిషన్​లు అందజేశారు. మహిళలు వ్యాపారాల్లో రాణించి, చేతుల్లో డబ్బులుంటే పిల్లల్ని బాగా చదివిస్తారన్నది సీఎం నమ్మకం.

22 జిల్లాలకు రూ.110 కోట్ల కేటాయింపు

అంతేకాదు.. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కొత్తగా 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే 10 జిల్లా కేంద్రాల్లో జిల్లా మహిళా సమాఖ్యలకు సొంత భవనాలున్నాయి. రాజధాని మినహా మిగిలిన 22 జిల్లాల్లో వాటి నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఒక్కో జిల్లాకు 5 కోట్ల చొప్పున మొత్తం 110 కోట్లను కేటాయించారు.

శిక్షణ కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్‌ వర్క్‌ షెడ్‌ వంటి అవసరాలకు అనువుగా ఈ ఇందిరా మహిళా శక్తి భవన్‌ల నిర్మాణాలు ఉండనున్నాయి. సంఘాల్లో కొత్త సభ్యులను చేర్పించడం, మహిళా శక్తి కార్యక్రమం నిర్వహణ, రుణ బీమా, ప్రమాద బీమా పథకాల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫాంల తయారీ, డ్వాక్రా బజార్‌ ఏర్పాటు, బ్యాంకు లింకేజీ కార్యక్రమం, వడ్డీలేని రుణాలు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు వంటి ఇలాంటివాటిపై చర్చించి తీర్మానాలు చేయిస్తున్నారు. వీటితో మహిళల దశ మారిపోతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు సీఎం రేవంత్.

5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా, దేశ చరిత్రలో తొలిసారి 4 వేల మహిళా సంఘాలతో సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎవరూ ఊహించని స్కీం. మహిళల కోసం ఇంతపెద్ద కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవడం సీఎం ఆలోచనే.

150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు

మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా మరిన్ని ఆర్టీసీ అద్దె బ‌స్సులు ప్రారంభించనున్నారు. తొలి విడతలో 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద 77,220 చెల్లిస్తారు. అటు బస్సులు కొనేందుకు మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ సైతం ప్రభుత్వమే ఇవ్వనుంది. ఇలా దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

31 జిల్లాల్లో మహిళ సంఘాల పెట్రోల్ బంకులు

31 జిల్లాల్లో మ‌హిళా సంఘాల‌తోనే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేయిస్తున్నారు. 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగా వాట్ల చొప్పున 64 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదే. వీటికి తోడు మహిళాశక్తి పాలసీతో మహిళలను ఆర్థికంగా మరో మెట్టు పైకి ఎక్కిస్తున్నారు. ఇవి చాలదా.. మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి. మాటల్లో కాదు.. చేతల్లో వారిని కోటీశ్వరులను చేసే కార్యక్రమాలివి. ఇవి ఎవరో చెబుతున్న మాటలు కాదు.. మహిళా సంఘాల సభ్యులు స్వయంగా వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్న సందర్భమిది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మహిళల అభివృద్ధిపై త్వరలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ సంకల్పాన్ని ఒక అన్నగా బలంగా తీసుకున్నారు సీఎం రేవంత్.

Also Read: మహిళల కుటుంబానికి సర్కారు భరోసా.. రూ.10 లక్షతో ఆ ధీమా!

సంకల్పం గొప్పదైతే విజయం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మహిళల అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ తీసుకుంటున్న చొరవతో చాలా మార్పు కనిపిస్తోంది. మహిళా సంఘాలు కళకళలాడుతున్నాయి. కీలక వ్యాపారాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఎవరూ ఊహించని కార్యక్రమాలను సీఎం పట్టాలెక్కించబోతున్నారంటున్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×