Bihar Crime : బీహార్ లో నలంద జిల్లాలోని హర్నాట్ బ్లాక్‌లో రోడ్డు పక్కన బూడిదతో కప్పిన ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ అరికాళ్లకు మేకులు కొట్టి ఉండడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరణించిన మహిళ వయస్సు 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు తెలుపుతున్నారు. ఆమె రెండు అరికాళ్లకు మేకులు కొట్టి ఉండడంతో.. ఏదైనా ముఢనమ్మకం కారణంగా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దారుణమైన సంఘటన బీహార్ అసెంబ్లీలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.
మృతదేహాన్ని పరిశీలించిన పోరీసులు ఆమె కుడి చేతికి సెలైన్లు ఎక్కించే ఇంట్రావీనస్ (IV) ఇన్ఫ్యూషన్ ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో.. ఆమె ఏదైనా అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకుంటూ మరణించిందా.? లేదా ఆసుపత్రి నుంచి తీసుకువచ్చి క్షుద్రపూజలకు వినియోగించారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాగా.. ఈ మహిళ మృతి ఆ ప్రాంతంలోని ప్రజల్లో భయాందోళనలు కలుగజేసింది. అలాగే.. ఆమెను హత్య చేసిన తర్వాత మేకు కొట్టారా లేదా తర్వాత కొట్టారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు. తీవ్ర చర్చనీయాంశమైన ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.
NH-471 పక్కన ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ప్రాంతం చండి పోలీస్ స్టేషన్ పరిధిలోని చండి-హర్నాట్ గ్రామ పరిధిలోకి ఓ గుంటలో పడేశారు. బుధవారం ఉదయం గ్రామస్తుల సమాచారంతో పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వివరాల్ని గుర్తించేందుకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఆమె వివరాల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.
మూఢనమ్మకం కారణంగా హత్య జరిగిందా.?
సంఘటన స్థలంలో గుమిగూడిన గ్రామస్తులు ఆ మహిళను వేరే చోట చేతబడి కారణంగా హత్య చేశారంటూ ఊహాగానాలకు తెరలేపారు. ఈ వార్త ప్రజల మధ్య పాకుతున్న కొద్దీ విపరీతంగా ముఢనమ్మకాల కారణంగా హత్య చేశారనే విషయం దావానంలా వ్యాపిస్తోంది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. ఆయా ఊహాగానాలను కొట్టిపారేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాతే అసలు విషయాన్ని వెల్లడిస్తామని ప్రకటించారు.
అలాగే..సంఘటనా స్థలంలో ఎలాంటి రక్తపు మరకలను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక అంచనా మేరకు మృతదేహాన్ని వేరే చోట నుంచి తీసుకువచ్చి రోడ్డు పక్కన విసిరివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చేతికి ఉన్న ఐవీ డ్రిప్ కారణంగా.. ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చి దురదృష్టవశాత్తు మరణించిందా? లేదా.. నిస్సహాయ స్థితిలోని ఆమెపై అత్యాచారం చేసి ఇక్కడ పడేశారా అనే విషయాల్ని నిర్థరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీని కుదిపేసిన దారుణ సంఘటన
మహిళ హత్య ఘటన గురువారం నాడు బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. సీఎం సొంత జిల్లాలలోనే ఇంతటి దారుణ ఘటన జరగడాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందంటూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్.. విమర్శలు గుప్పించారు. బీహార్ మహిళలపై దారుణాలు, వేధింపుల పరంగా అగ్రశ్రేణి రాష్ట్రాలలో ఒకటిగా ఉందని, సీఎం సొంత జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక, దారుణమైన సంఘటనే అందుకు సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Also Read : Karimnagar News: పెళ్లికి పెద్దలు నో అన్నారు.. విడిపోయి ఉండలేక, ఆపై ఆత్మహత్య