Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8లో తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో యష్మీ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. యష్మీ బయటికి రావడానికి నిఖిల్‌తో లవ్ ట్రాకే కారణమనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ యష్మీ మాత్రం ఈ విషయాన్ని అస్సలు ఓపెన్‌గా ఒప్పుకోవడం లేదు. బిగ్ బాస్ ప్రారంభమయిన మొదట్లో యష్మీ ఆట ప్రేక్షకులకు నచ్చకపోయినా తన గొడవల వల్ల మజా వస్తుందని ఓట్లు వేసినవారు చాలామందే ఉన్నారు. కానీ నిఖిల్‌తో లవ్.. ట్రాక్ తప్పడంతో తను ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్‌లో పాల్గొన్న యష్మీ.. నిఖిల్‌పై ఓపీనియన్‌ను ఓపెన్‌గా చెప్పేసింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
అభిప్రాయాలు మారుతాయి
‘‘యష్మీ అనే నేను. బిగ్ బాస్ బజ్‌లో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ యష్మీ చెప్పడంతో బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభమవుతుంది. ముందుగా అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యావో ఎప్పుడైనా ఆలోచించావా అని అర్జున్ అడగగా.. ‘‘బిగ్ బాస్ హౌస్‌లో నా అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. చూసిన వాళ్లకి నా మాట మారుస్తున్నట్టు అనిపించొచ్చు కానీ బయట నుండి అది పెద్ద ప్రాబ్లమ్’’ అని తను మాటలు మార్చడం గురించి సమర్థించుకుంది యష్మీ. అది వినగానే దీనినే తొందరపాటుతనం అంటారని అర్జున్ కౌంటర్ ఇచ్చాడు.
Also Read: వెళ్తూ వెళ్తూ నిఖిల్‌ను సేవ్ చేసిన యష్మీ.. వాళ్లే నా శత్రువులు అంటూ స్టేట్‌మెంట్
మంచి ఫ్రెండ్ మాత్రమే
ఆ తర్వాత వరుసగా యష్మీపై ప్రశ్నల వర్షం కురిపించాడు అర్జున్. ‘‘యష్మీ గ్రూప్ గేమ్ ఆడిందా? లేదా? నామినేషన్స్‌లో గ్రూప్‌గా డిస్కస్ చేసుకొని నామినేట్ చేశారా? లేదా? ఫిజికల్ అవ్వలేకపోతే బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చారు అనే మాట గుర్తుందా?’’ అని అడిగాడు. చివరికి ‘‘నిఖిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి?’’ అని ప్రశ్నించాడు అర్జున్. తను నాకు మంచి ఫ్రెండ్ అంటూ సమాధానమిచ్చింది యష్మీ. ‘‘తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా? ఆ ఫీలింగ్స్ ఏంటి’’ అంటూ స్పష్టంగా అడిగాడు. ఆపై తను సమాధానం ఇవ్వకముందే నిఖిల్, యష్మీ కొన్నాళ్ల క్రితం మాట్లాడుకున్న ఒక వీడియోను తనకు చూపించాడు.
హాట్ టాపిక్ మీరే
‘‘నేను సింగిల్. నా లైఫ్‌లో ఇన్ని ఇబ్బందులు ఉండవు’’ అంటూ అర్జున్ చూపించిన వీడియోలో నిఖిల్‌తో చెప్తుంది యష్మీ. ‘‘మీకు ఫీలింగ్స్ లేనప్పుడు, అది కేవలం ఒక కల అన్నప్పుడు గౌతమ్ షర్ట్ వేసుకొని నిఖిల్ కుళ్లుకునేలా చేయాలని ఎందుకు అనుకున్నారు?’’ అని అడిగాడు అర్జున్. యష్మీ.. అర్జున్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మాట మార్చింది. ‘‘ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి కొంచెం నవ్వినా కూడా సిగ్గుపడుతుంది, నవ్వుతుంది, ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటారు ఏం చేస్తాం’’ అని చెప్పింది. సోషల్ మీడియాలో నిఖిల్, యష్మీలదే హాట్ టాపిక్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అర్జున్.