BigTV English

Philippines President Assassinate: ప్రెసిడెంట్‌ని హత్య చేయిస్తా.. వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు!

Philippines President Assassinate: ప్రెసిడెంట్‌ని హత్య చేయిస్తా.. వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు!

Philippines President Assassinate| రాజకీయాలలో నాయకులందరూ అధికారమే పరమావధిగా ఉంటారు. ప్రజా సేవ చేసే నాయకులు చాలా అరుదు. అభివృద్ధి, సంక్షేమం తరువాత ముందు అధికారం కావాలి, పదవి కావాలి. అయితే కొన్నిసార్లు ఈ రాజకీయాలు స్పష్టంగా తెలిపోతాయి. తాజాగా ఫిలిప్పీన్స్ రాజకీయాలే అందుకు ఉదాహరణం. అక్కడ ప్రస్తుత ప్రెసిడెంట్ ఫర్డీనాన్డ్ మార్కోస్ జూనియర్, మహిళా వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరె మధ్య ఒక రాజకీయ యద్ధమే నడుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ పరిస్థితే వస్తే ప్రెసిడెంట్ మార్కోస్‌ని హత్య చేయిస్తాను అని చెప్పింది. పైగా తాను జోక్ చేయడం లేదని హెచ్చరించింది.


దీంతో ఫిలిప్పీన్స్ విచారణ ఏజెన్సీలు ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత అని దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. ఒకవేళ ప్రెసిడెంట్‌ని హత్య చేసేందుకు వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరె కుట్ర చేస్తున్నారని తేలితే ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రెసిడెంట్ కార్యాలయ అధికార ప్రతినిధి ఒక ప్రకటన జారీ చేశారు. “సారా డుటెరె వ్యాఖ్యలపై విచారణ చేసి.. ఆమె దోషి అని తేలితే చట్టపరంగా చర్యలు చేపట్టండి. ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా లభిస్తే.. వెంటనే ఆమెను అరెస్టు చేయండి.” అని న్యాయ శాఖకు ఆదేశించారు.

మరోవైపు ఫిలీప్పీన్స్ భద్రతా కౌన్సిల్ కూడా వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరె వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారు ఎడుఆర్డో ఆనో మాట్లాడుతూ.. “ప్రెసిడెంట్‌కు ప్రాణహాని ఉండే విధంగా బెదిరింపుల చేస్తే చాలా సీరియస్ గా పరిగణిస్తాం. విచారణ అధికారులు, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, పోలీసులు అన్ని శాఖలు కలిసి ఈ కేసుని డీల్ చేస్తాయి. ప్రెసిడెంట్‌కు ప్రాణహాని అంటే అది జాతీయ భద్రతా సమస్యగా చూడాలి.” అని చెప్పారు.


Also Read: ఆఫీసులో నిద్రపోయినందకు ఊడిన ఉద్యోగం.. కంపెనీకి రూ.40 లక్షలు జరిమానా!

వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరె ఏమన్నారు?
శనివారం నవంబర్ 23, 2024 ఉదయం మీడియా సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరె ఒక ప్రకటన చేశారు. “నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. అందుకే నేను కూడా ఒకరితో మాట్లాడా. నన్ను ఎవరైనా చంపేస్తే.. వెంటనే ప్రెసిడెంట్ మార్కోస్ ని కూడా చంపేయమని చెప్పాను. పార్లమెంట్ స్పీకర్ మార్టిన్ రోముఆల్డేజ్, మార్కోస్ భార్య లీజా అరానేటా ని కూడా చంపేయమని చెప్పాను. నేను జోక్ చేయట్లేదు. వారు చనిపోయేంతవరకు దాడి చేస్తూనే ఉండాలి. ఆగకూడదు. అని ఆ వ్యక్తికి చెప్పాను. అందుకు ఆ వ్యక్తి అంగీకరించాడు.” అని సారా డుటెరె అన్నారు.

అమె ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ప్రెసిడెంట్ మార్కోస్ భద్రతను మరింత పెరిగిపోయిందని స్థానిక మీడియా తెలిపింది.

సారా డుటెరె, ప్రెసిడెంట్ మార్కోస్ మధ్య గొడవేంటి?
వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరె ఇంతకు ఎడుకేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రజా ధనాన్నిదుర్వినియోగం చేశారని ఆమెపై విచారణ సాగుతోంది. ఆ విచారణకు డుటెరె చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్డుపడుతున్నారని ఆయనను అరెస్టు చేశారు. సారా డుటెరె మరెవరో కాదు.. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటెరె కూతురు. ఒకప్పుడు రోడ్రిగో డుటెరె, మార్కోస్ ఇద్దరూ ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. రోడ్రిగో సాయంతోనే మార్కోస్ 2022లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.

అయితే 2024లో ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు తెలెత్తాయి. ముఖ్యంగా మార్కోస్(Phillipines President)  అండదండలతో దేశంలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని ఆరోపణలున్నాయి. అందుకే సారా డుటెరె.. మార్కోస్ మంత్రివర్గంలో తన ఎడుకేషన్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసి కేవలం వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఫిలిప్పీన్స్ లో వైస్ ప్రెసిడెంట్ కు ప్రత్యేక అధికారాలేవి ఉండవు. ఇలాంటి సమయంలో ఆమె ప్రెసిడెంట్ మార్కోస్ డ్రగ్స్ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు సారా డుటెరె దేశంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ఆమెతో కలిసి పోరాడుతున్న వారిపై మార్కోస్ అనుచరులు దాడులు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా దాదాపు 6000 మందిని చంపేశారని సమాచారం. పైగా ఫిలిప్పీన్స్ పార్లమెంట్ స్పీకర్, ప్రెసిడెంట్ మార్కోస్ సోదరుడు రోముఆల్డేజ్ ఆమె వైస్ ప్రెసిడెంట్ కార్యాలయానికి 60 శాతానికిపైగా నిధుల కోత విధించారు.

తనకు తోడుగా నిలబడిన వారిని హత్య చేయిస్తున్న ప్రెసిడెంట్ మార్కోస్ పై సారా డుటెరె గత కొంతకాలంగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అక్టోబర్ లో ఒకసారి ఆమె మాట్లాడుతూ.. “ప్రెసిడెంట్ మార్కోస్ ఒక అసమర్థుడు, ఆయన తల నరికేయాలని ఉంది.” అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×