BigTV English
Advertisement

Luxury railway stations India: మన దేశంలో టాప్ రైల్వే స్టేషన్ అంటే ఇదే.. ఎందుకింత స్పెషల్?

Luxury railway stations India: మన దేశంలో టాప్ రైల్వే స్టేషన్ అంటే ఇదే.. ఎందుకింత స్పెషల్?

Luxury railway stations India: ఇండియన్ రైల్వేలో ఎప్పుడూ ప్రయాణాలు సులభంగా, సౌకర్యవంతంగా ఉండాలని అందరి కోరిక. కానీ ఈ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్ లగ్జరీ ఫెసిలిటీస్ మీ కళ్ల ముందుకు వచ్చేస్తాయి. నమ్మడం లేదా? అయితే ఇక్కడికి వెళ్లండి. ఎక్కడో కాదు భోపాల్‌లో గల ఈ స్టేషన్ కు వెళితే సరి. మునుపటి హబీబ్‌గంజ్ స్టేషన్‌ను పూర్తిగా మార్చి ఇప్పుడు రాణి కమలాపతి రైల్వే స్టేషన్ పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి పరిచారు. ఇది ఇండియన్ రైల్వే చరిత్రలో మొదటి ప్రైవేట్ మేనేజ్‌మెంట్ స్టేషన్ కావడం విశేషం.


హబీబ్‌గంజ్ నుండి రాణి కమలాపతి వరకు
ఈ స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రయాణం నిజంగా ప్రత్యేకం. బన్సాల్ గ్రూప్, ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (IRSDC) కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో దీన్ని ఎయిర్‌పోర్ట్ స్థాయిలో మార్చేశారు. 2021 నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త స్టేషన్‌ను ప్రారంభించారు. భారత చరిత్రలో ప్రముఖురాలైన గోండ్ రాణి కమలాపతి జ్ఞాపకార్థం దీనికి కొత్త పేరు పెట్టారు. ఇకపై స్టేషన్ కోడ్ HBJ నుండి RKMPగా మారింది.

ఇక్కడి ఫెసిలిటీస్ తెలుసుకుందాం
ఈ స్టేషన్‌లోకి అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టే ఫీల్ వస్తుంది. విశాలమైన కాంకోర్స్‌ ఉండడంతో ప్రయాణికులు గుమిగూడే సమస్య లేకుండా ఉంటుంది. వెయిటింగ్ లాంజ్‌లు చూస్తే సౌకర్యవంతమైన కుర్చీలు, చక్కటి డెకరేషన్ కలిగి ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ అవుట్‌లెట్లు చూస్తే ప్రయాణం చేసే ముందు తప్పక షాపింగ్ చేసేస్తారు. సోలార్ పవర్ తో నడిచే స్టేషన్లలో ఇదొకటి. అలాగే హైటెక్ సెక్యూరిటీ విధానంలో భాగంగా సీసీ కెమెరాలు, డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్‌తో భద్రత కల్పించారు. ఇలాంటివి సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌లలో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కూడా అందుబాటులో రావడం ఒక అద్భుతమైన మార్పు.


ఎందుకు PPP మోడల్ ప్రత్యేకం?
ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌ అంటే ప్రయాణికులకు మెరుగైన సేవలు, వేగంగా సదుపాయాల అప్‌గ్రేడ్. అయినప్పటికీ యాజమాన్యం మాత్రం ఇండియన్ రైల్వే వద్దే ఉంటుంది. ఈ విధానం వల్ల రైల్వేకు ఆర్థిక భారమూ తగ్గుతుంది, ప్రైవేట్ సంస్థల సొంత పెట్టుబడితో సౌకర్యాలు పెరుగుతాయి. హబీబ్‌గంజ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ఎంత విజయవంతంగా పని చేస్తుందో నిరూపించింది.

Also Read: Indian Railways services: ఒక్క క్లిక్ తో టికెట్ రిజర్వేషన్.. రైల్వే సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ ఛాన్స్ మాత్రం వారికే!

భవిష్యత్ రైల్వే ప్రాజెక్టులకు దారి
హబీబ్‌గంజ్ మాదిరిగా న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై CST వంటి స్టేషన్లను కూడా రీడెవలప్ చేయాలని రైల్వే ప్రణాళికలో ఉంది. భవిష్యత్తులో రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్ లేదా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌ మాదిరిగా కనిపించవచ్చని అనిపిస్తోంది. ఇది దేశంలోని రైల్వే ప్రయాణాల రూపాన్ని పూర్తిగా మార్చబోతుంది.

ఇదొక రైల్వే విప్లవం
గత 11 ఏళ్లలో రైల్వే రంగంలో భారీ మార్పులు జరిగాయి. 100% విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లు, హైటెక్ ప్లాట్‌ఫాంలు, స్మార్ట్ బుకింగ్ సిస్టమ్స్.. ఇవన్నీ రైల్వేను ఒక కొత్త దిశలో నడిపిస్తున్నాయి. ప్రయాణికుల అనుభవం మరింత సులభం, వేగం, సౌకర్యవంతంగా మారుతోంది.

రాణి కమలాపతి స్టేషన్ ప్రయాణికులకు ఇచ్చే అనుభవం
ఇక్కడి సదుపాయాలు చూసిన తర్వాత ప్రయాణికులు.. ఇది నిజంగా రైల్వే స్టేషనేనా? అని ఆశ్చర్యపడతారు. క్లీన్ వాష్‌రూమ్స్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డ్స్, ఫుడ్ కోర్ట్ రుచులు.. ఇవన్నీ ఒక మాల్‌లో షాపింగ్ చేస్తున్నట్టే అనిపిస్తాయి. ఇది కేవలం సదుపాయం మాత్రమే కాదు, భారత రైల్వే ఆధునీకరణలో ఒక కొత్త దశ. రాణి కమలాపతి స్టేషన్ లగ్జరీ అనుభవం ఇప్పుడు ప్రయాణికులకు కొత్త ప్రామాణికాలు సెట్ చేసింది. రాబోయే కాలంలో దేశంలోని ఇతర ప్రధాన స్టేషన్లు కూడా ఇలాగే మోడ్రన్ అవుతాయనే నమ్మకం ఉంది. ఈ మార్పులు కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా రైల్వే ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాయి.

Related News

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

IRCTC Air Travel: రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌తో విమాన ప్రయాణం.. విద్యార్థులు, ఉద్యోగులకు ఐఆర్‌సిటిసి ఎయిర్ ఆఫర్

Viral: ఏనుగులకు దారి ఇచ్చేందుకు.. 13 రైళ్లు నిలిపేసిన రైల్వే అధికారులు!

Big Stories

×