E-Paper
Advertisement

వందే భారత్‌లో ‘ఫుడ్’ దందా.. నిలదీస్తే ఏం చేశారో తెలుసా?

వందే భారత్‌లో ‘ఫుడ్’ దందా.. నిలదీస్తే ఏం చేశారో తెలుసా?
Advertisement

Vande Bharat Overcharge Incident: భారతీయ రైల్వేలోకి అత్యాధునిక రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అడుగు పెట్టింది. అత్యధిక వేగం, అధునాతన సౌకర్యాలు ప్రయాణికులకు మంచి ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ ను అందించడంలో ముందుంటున్నాయి. చక్కటి మెయింటెనెన్స్ తో ప్యాసింజర్స్ ను ఈ రైళ్లు ఆకట్టుకుంటున్నాయి. కానీ, గత కొద్ది రోజులుగా వందేభారత్ రైళ్ల ఫుడ్ గురించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్నంలో నాణ్యత లేకపోవడం, పెరుగులో పురుగులు లాంటి ఘటనలు ప్రయాణికులలో ఆందోళన కలిగించాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

వందేభారత్ లో ఫుడ్ దందా!

తాజాగా వందేభారత్ లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఆయన రైలులో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇందుకోసం రూ. 150 ఛార్జ్ చేశారు. అయితే, బిల్లు మాత్రం రూ. 220 ఇచ్చారు. ఎందుకు ఇలా ఎక్కువ వసూలు చేస్తున్నారో అడిగితే, రొటీ వేరు ఐటమ్ అని, దానికి అదనంగా రూ. 70 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.  ఇది విన్న వెంటనే ఆయనకు ఏదో సరిగా లేదనే అనిపించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ, సదరు ప్రయాణికుడు అలా చేయలేదు. వెంటనే రైల్వే అధికారిక హెల్ప్‌ లైన్ అయిన 139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

Advertisement

ఫిర్యాదు చేసిన కాసేపటికి ఏం జరిగిందంటే?

ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే పరిస్థితి మారిపోయింది. రైలులోని క్యాటరింగ్ మేనేజర్ స్వయంగా ఆయన దగ్గరికి వచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు మాట్లాడారు. అయితే, ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. “మీరు ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే, నేను మీకు రూ. 70 తిరిగి ఇస్తాను. లేదంటే మాకు పెద్ద సమస్యలు వస్తాయి. సుమారు రూ. 50,000 వరకు నష్టం జరుగుతుంది”  అన్నారు.

Advertisement

ఈ మాటలు వినగానే, ఈ వ్యవహారం ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది. ఒక చిన్న మొత్తాన్ని వసూలు చేసినా, అది బయటపడితే సంస్థకు పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంటే, ఇలాంటి తప్పులు చాలా మంది క్యాటరర్స్ చేస్తున్నారని, వారిపైనా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అర్థం అవుతోంది. ఈ ఘటనలో సదరు ప్రయాణికుడు సైలెంట్ గా ఉండకపోవడం వల్ల ఎంతో మంది మోసానికి గురయ్యే అవకాశం తగ్గింది. ఎవరో ఒకరు ప్రశ్నించాలి, అప్పుడు మాత్రమే మార్పు మొదలవుతుందని ఈ ఘటనతో తేలిపోయింది.

చిన్న రియాక్షన్.. పెద్ద ఇంపాక్ట్!

ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ, పెద్ద మెసేజ్ ఇస్తుంది. ఎక్కడైనా మనకు అనుమానం కలిగితే, అది చిన్న విషయం అయినా సరే, నిర్లక్ష్యం చేయకూడదు.  వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా  మోసాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. అటు ఈ ఘటనపై IRCTC కూడా విచారణ జరిపి, తగిన యాక్షన్ తీసుకోనున్నట్లు వెల్లడించింది.

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×