Tourist Places In India: ఒక్కసారైనా విదేశాలకు ట్రిప్ వెళ్లాలని అనుకునే మధ్యతరగతి కుటుంబాలు చాలానే ఉంటాయి. మేఘాల గుండా తమ కలల గమ్యస్థానానికి ఎగురుతూ ఆనందించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మాల్దీవులు చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. మాల్దీవుల్లోని అందమైన,శుభ్రమైన బీచ్‌లు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. కానీ ప్రతి ఒక్కరూ మాల్దీవులను సందర్శించాలనే తమ కలను నెరవేర్చుకోలేరు. ఇలాంటి పరిస్థితిలో భారతదేశంలోనే తక్కువ బడ్జెట్‌లో మాల్దీవులను ఆస్వాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అందమైన పర్యాటక ప్రదేశాలు:
మీరు ఇండియాలో ఉంటూనే మాల్దీవులను నిజంగా ఆస్వాదించాలనుకుంటే.. దక్షిణ భారతదేశంలోని ఈ ఉత్తమ ప్రదేశాలకు మీరు వెళ్లొచ్చు. ఇవి సహజమైన ప్రకృతి అందాల కారణంగా విదేశీ పర్యాటక ప్రాంతాలను మైమరపిస్తున్నాయి.
కొల్లం:
కొల్లంలోని కొల్లం బీచ్ ఎంత అందమైన బీచ్ అంటే.. దానితో పోలిస్తే మాల్దీవులే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల పర్యాటక ప్రదేశాలు కూడా పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇక్కడ అందమైన నీలి సముద్రపు బీచ్‌లు ఒకవైపు అందంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇక్కడి సహజ నేపథ్యం కూడా చాలా ఫోటోజెనిక్‌గా ఉంటుంది. కొల్లంలోని ఈ అందమైన బీచ్ చూడటానికి మాత్రమే కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్, అడ్వెంచర్ లకు కూడా ప్రసిద్ధి చెందింది.
కరుణగప్పల్లి:
రెండవ స్థానంలో కొల్లం నగరానికి 27 కి.మీ దూరంలో ఉన్న కరుణగప్పల్లి ఉంటుంది. కరుణగప్పల్లి అందం చెప్పడానికి మాటలు చాలవు. ఈ అందమైన ప్రదేశం కారణంగా దీనిని దేవతల భూమి అని పిలుస్తారు. కరుణగప్పల్లిలో స్టే చేయడానికి చాలా అందమైన హౌస్ బోట్లు ఉంటాయి. వాటిలో స్టే చేయడం ద్వారా మీరు మీ ప్రయాణాన్ని చాలా ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.
వయనాడ్:
ఈ లిస్ట్‌లో మూడవ స్థానంలో దక్షిణ భారతదేశంలోని కొల్లం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న మయనాడ్ గ్రామం ఉంది. ఈ ప్రదేశాన్ని చూడటానికి నిత్యం వేల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఈ ప్రదేశం మాల్దీవులను తప్పకుండా మైమరపించేలా చేస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూడటం అందమైన అనుభూతిని కలిగిస్తుంది.
Also Read: రోప్ వేపై నుండి ప్రకృతి అందాలు.. చూడకపోతే చాలా మిస్సవుతారు !
కొచ్చి:
ఈ ప్రదేశాలే కాకుండా.. మీరు కొచ్చిని కూడా చూడటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకృతి అందాల మీ ఈ ప్రయాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంతే కాకుండా కేరళలో ఉన్న కొచ్చి చాలా అందమైన ప్రదేశం. ఇక్కడి సహజ సౌందర్యానికి జనం ఆకర్షితులవుతారు. లక్షద్వీప్ తీరంలో కనిపించే అందమైన దృశ్యాలు కళ్ళకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ సుందరమైన ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా మీరు ఆనందాన్ని పొందవచ్చు.