Kannappa Update: మంచు ఫ్యామిలీ (Manchu family)ప్రెస్టేజియస్ మూవీ గా మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలోనే న్యూజిలాండ్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం, ఇండియాకు తిరిగివచ్చారు. దీంతో సినిమా విడుదల తేదీను టార్గెట్ గా పెట్టుకొని, ముందుకు వెళ్లాలని టీం భావించింది. అందులో భాగంగానే కీ రోల్ లో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన లుక్స్ ను విడుదల చేస్తూ వచ్చారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్..
వచ్చే నెల విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారు..? ఏ పాత్రలలో నటించబోతున్నారు..? అనే విషయాలను పోస్టర్స్ ద్వారా రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది స్టార్ నటులు ఇందులో నటిస్తున్నారు. ప్రభాస్(Prabhas ) ఈ సినిమాలో శివుడిగా, పార్వతీదేవిగా నయనతార (Nayanatara) నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇకపోతే ఈ సినిమాపై హైప్ పెంచడానికి చిత్ర బృందం ఏవేవో చేస్తున్నా.. సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ట్రోల్స్ కి గురవుతూనే ఉంది.
ట్రోల్ కంటెంట్..
ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి లుక్ కూడా ట్రోల్ కంటెంట్ అయిపోయింది. చివరికి సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న ప్రభాస్ లుక్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ ప్రభాస్ లుక్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పుకునే మోహన్ బాబు(Mohan Babu) లుక్ కూడా ఈ నెల 22వ తారీఖున రాబోతోంది. మరి ఇది కూడా ట్రోల్ కంటెంట్ అవుతుందా..? లేక ట్రోల్స్ రాకుండా మహాదేవ శాస్త్రీ కాపాడుతారా..? అన్నది తెలియాల్సి ఉంది.
మహాదేవ శాస్త్రి లుక్ పోస్టర్..
మూడు అడ్డనామాలతో రౌద్రం ప్రదర్శిస్తూ మోహన్ బాబు ముఖాన్ని మాత్రమే రివీల్ చేస్తూ ఒక పోస్టర్ వదిలారు. అంతేకాదు మహదేవశాస్త్రి లుక్ నవంబర్ 22వ తేదీన రాబోతోంది అంటూ చిత్రబృందం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. మరి మహదేవ శాస్త్రీగా నటించబోతున్న మోహన్ బాబు తన లుక్ తో ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.ఇకపోతే ఇప్పటివరకు వస్తున్న ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం మోహన్ బాబు లుక్ ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు వార్తలు వస్తున్నాయి కానీ మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే లుక్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
కన్నప్ప విశేషాలు..
ఒక కన్నప్ప సినిమా విషయానికి కొస్తే.. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar Singh)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ , నయనతార, ఐశ్వర్య, మధుబాల, బ్రహ్మానందం, ఆర్.శరత్ కుమార్, రఘు బాబు, సప్తగిరి తదితరులు నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా టీజర్ మే 25న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో విడుదల చేసిన విషయం తెలిసింది. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Capturing devotion and grandeur. Presenting the Majestic pre-look of @themohanbabu garu as ‘Mahadeva Shastri’ from #Kannappa🏹. Stay tuned as the full look unveils on the 22nd of November!🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/sQ24byXpPo
— Kannappa The Movie (@kannappamovie) November 18, 2024