E-Paper
Advertisement

SC On Indian Railways: టికెట్ ఇన్సూరెన్స్ లో వివక్ష ఎలా? రైల్వేకు సుప్రీం కీలక ప్రశ్న!

SC On Indian Railways: టికెట్ ఇన్సూరెన్స్ లో వివక్ష ఎలా? రైల్వేకు సుప్రీం కీలక ప్రశ్న!
Advertisement

Accident Insurance:  భారతీయ రైల్వే ప్రయాణీకుల భద్రతకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతే ప్రమాద బీమా లభించేలా ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తోంది. టికెట్ కొనుగోలు సమయంలోనే ఇన్సూరెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ సదుపాయం ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఉంది. ఆఫ్ లైన్ టికెట్లు కొనుగోలు చేసే వారికి లేదు. ఈ  అంశానికి సంబంధించిన తాజాగా భారతీయ రైల్వేకు సుప్రీం కోర్టు కీలక ప్రశ్నలు వేసింది. ఆన్‌ లైన్‌ లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ప్రమాద బీమా సదుపాయం ఎందుకు అందుబాటులో ఉంది? ఆఫ్‌ లైన్ టికెట్ కొనుగోలుదారులకు అదే రక్షణ ఎందుకు లేదు? అని వివరణ అడిగింది.

వారికి మాత్రమే ఎందుకు ఆ కవరేజ్?

కోర్టు నియమించిన అమికస్ క్యూరీ దీనిని హైలైట్ చేసిన తర్వాత న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్నను లేవనెత్తింది. ప్రస్తుత వ్యవస్థ ఆన్‌ లైన్, ఆఫ్‌ లైన్ టికెట్ కొనుగోలుదారుల మధ్య వ్యత్యాసాన్ని ఎందుకు చూపిస్తుందో చెప్పాలన్నది. ఈ విషయంలో రైల్వే తరపున అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ కోర్టులో హాజరయ్యారు. “అదనంగా, ప్రమాదాలను కవర్ చేయడానికి ఆన్‌ లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణీకులకు బీమా కవర్ అందించబడుతుందని అమికస్ ఎత్తి చూపింది. ఇది ఆఫ్‌ లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే వారికి అందుబాటులో లేదు. టికెట్ల కొనుగోలులో రెండు పద్ధతుల మధ్య ఈ వ్యత్యాసానికి కారణాన్ని బెనర్జీ సూచనలు తీసుకోవాలి” అని నవంబర్ 25న జారీ చేసిన తన ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Read Also: విమానాల్లోకి కొబ్బరి కాయలను అనుమతించరు.. ఎందుకంటే?

వివరణ ఇవ్వాలని ఆదేశించిన రైల్వే

రైల్వే భద్రత, ప్రయాణీకుల రక్షణకు సంబంధించిన కేసులో భాగంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ట్రాక్ భద్రత, రైల్వే క్రాసింగ్‌ లపై తక్షణ శ్రద్ధ వహించాలని గమనించి, రైల్వే సమర్పించిన నివేదికను కూడా కోర్టు సమీక్షించింది. రైల్వేలు దాని మొత్తం భద్రతా మెరుగుదల రోడ్‌ మ్యాప్‌ తో ముందుకు సాగాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. జనవరి 13కి తదుపరి విచారణను వాయిదా వేసింది. అదే సమయంలో బీమా అసమానతను ప్రత్యేకంగా పరిష్కరిస్తూ, ఇండియన్ రైల్వే  తన ప్రతిస్పందనను సమర్పించాలని ఆదేశించింది.

Advertisement

Read Also: గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×