Raksha Bandhan Special Trains: అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక జరపుకునే వేడుకు రక్షాబంధన్. ఎక్కడ ఉన్నా, రాఖీ పౌర్ణమి రోజున తమ తోబుట్టువుల దగ్గరికి వెళ్లా రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారు సోదరీమణులు. రాఖీ పౌర్ణమి మరో రెండు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా ప్రత్యే రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆగస్టు 8–17 వరకు ఈ రక్షాబంధన్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
రక్షాబంధన్ కోసం ప్రత్యేక రైళ్లు
⦿ మదర్- రోహ్తక్-మదర్ రైలు
ఈ మార్గంలో ఆగష్టు 8 నుంచి 10 వరకు రాఖీ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రైలు నెంబర్ 09639 రాజస్థాన్ మదర్ నుంచి ఉదయం 4.30 గంటలకు బయల్దేరి హర్యానాలోని రోహ్ తక్ కు మధ్యాహ్నం 12.50 గంటలకు చేరకుంటుంది. • తిరుగు ప్రయాణంలో ఇదే రైలు( 09640) మధ్యాహ్నం 1.20 గంటలకు రోహ్ తక్ నుంచి బయలుదేరి రాత్రి 10.35 గంటలకు మదర్ కు చేరుకుంటుంది. ఈ రైలు కిషన్ గఢ్, ఫులేరా, రీంగస్, నీమ్ కా థానా, నార్నాల్, రేవారీ, ఝజ్జర్, అస్తల్ బోహార్ స్టేషన్లలలో ఆగుతుంది. ఈ రైలులో 16 జనరల్ కోచ్‌లు, రెండు గార్డ్ వ్యాన్‌లు ఉంటాయి.
⦿ భోపాల్- రేవా ప్రత్యేక రైళ్లు
భోపాల్- రేవా మధ్య మధ్యప్రదేశ్ మార్గంలో రెండు వన్-వే ప్రత్యేక రైళ్లను వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు మధ్యప్రదేశ్ హార్ట్ ల్యాండ్స్, శాటిలైట్ టౌన్ల నుంచి ప్రయాణిస్తాయి. సత్నా, మైహార్, కట్ని, దామోహ్, సాగర్, బినా, విదిషా స్టేషన్లలో ఆగుతాయి. రైలు నంబర్ 01704 ఆగష్టు 10న సాయంత్రం 6.45 గంటలకు రేవా నుండి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.40 గంటలకు భోపాల్‌లోని రాణి కమలాపతి స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆగస్టు 11న తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (01703) ఉదయం 6.20 గంటలకు భోపాల్ నుండి బయలుదేరి రాత్రి 8.30 గంటలకు రేవా చేరుకుంటుంది.
Read Also: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?
⦿ మహారాష్ట్రలో 18 ప్రత్యేక రైళ్లు
రక్షాబంధన్ సంబర్భంగా మహారాష్ట్రలో మొత్తం 18 రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో పూణే- నాగ్ పూర్ మధ్య 6 ప్రత్యేక రైళ్లు, CSMT- నాగ్‌పూర్ మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇతర ప్రాంతాల్లో మిగతా రైళ్లు ప్రయాణీకులను సేవలను అందిస్తాయన్నారు. ఈ ప్రత్యేక రైళ్లల ద్వారా రక్షాబంధన్ కు వెళ్లే వారు ప్రయాణాలు చేయవచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?