E-Paper
Advertisement

South Central Railways: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

South Central Railways: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!
Advertisement

Tirupati Special Trains: తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ పెరిగిన నేపథ్యంలో వీక్లీ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. హిసార్ నుంచి తిరుపతికి 2 వీక్లీ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. అటు సికింద్రాబాద్, విశాఖ మధ్యలో నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు కోచ్ ల సంఖ్య పెంచుతున్నట్లు తెలిపింది.

వీక్లీ స్పెషల్ రైళ్ల వివరాలు

Advertisement

ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హిసార్-తిరుపతి నడుమ రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత సెంట్రల్ రైల్వే వెల్లడించింది. హిసార్- తిరుపతి ప్రత్యేక రైలు(04717) ప్రతి శనివారం హిసార్ నుంచి బయల్దేర నుంది. మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 14 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. అటు తిరుపతి-హిసార్ స్పెషల్ ట్రైన్(04717) ప్రతి సోమవారం తిరుపతి నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు మంగళవారం నాడు హిసార్ కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లను తిరుపతి భక్తులతో పాటు సాధారణ ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వందేభారత్ రైళ్లకు అదనపు బోగీలు

Advertisement

అటు సికింద్రాబాద్- విశాఖపట్నం నడుమ నడిచే వందేభారత్ రైలుకు డిమాండ్ భారీగా ఏర్పడిన నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు అదనపు బోగీలను యాడ్ చేస్తున్నట్ల వెల్లడించింది. ప్రస్తుతం ఈ రైలు 8 కోచ్ లతో నడుస్తుండగా, ఇకపై ఆ సంఖ్యను 16కు పెంచనున్నారు. అటు సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రస్తుతం 16 కోచ్ ల రైలు నడుస్తున్నది. దీనికి కూడా ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో మరో 4 కోచ్ లను యాడ్ చేయనున్నారు. ఇకపై ఈ రైలు 20 కోచ్ లతో అందుబాటులోకి రానుంది. రీసెంట్ గా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వందేభారత్ రైళ్లకు అదనపు కోచ్ లో ఏర్పాటు చేయడంతో పాటు రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తగ్గిస్తామని కేంద్రరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. వందేభారత్ రైళ్లకు బోగీల సంఖ్య పెరగడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పలు రైళ్ల దారి మళ్లింపు

అటు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్ లోని విశాఖపట్నం- కిరండూల్ రైళ్లకు స్లీపర్, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ లను పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. మరోవైపు గుంతకల్ డివిజన్ లో ఈ నెల రైల్వే లైన్లకు సంబంధించి సెక్యూరిటీ పనులు కొనసాగనున్నాయి. డిసెంబర్ 4 నుంచి 13 వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంద్యాల-థోనే-అనంతపురం రైట్లలో నడవాల్సిన రైళ్లు.. నంద్యాల- యర్రగుంట్ల- గూటి-అనంతపురం మీదుగా నడవనున్నాయి. ప్రయాణీకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఎన్ని వేల రైళ్లు కేటాయించిందంటే?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×