Visakhapatnam: ప్రేమించి.. పెళ్లి చేసుకుని కలకాలం కలిసుందాం అనుకున్నారు. కానీ విధి పగబట్టింది. ఏం జరిగిందో ఏమ్మో తెలియదు ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది. విశాఖ షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు అమలాపురానికి చెందిన పిల్లు దుర్గారావు, సాయి సుష్మితగా గుర్తించారు పోలీసులు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా.. సాయి సుష్మిక ఓ ప్రైవేటు కంపెనీలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది.
ఆరు నెలలుగా బినాయక్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో అంటున్న దుర్గారావు దగ్గరికి సాయి సుష్మిత వచ్చి వెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు ముందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం గుర్తించారు. ఇక మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.