BigTV English

Tummala Comments : భూమికి విత్తుకు ఉన్న సంబంధం- కాంగ్రెస్, రైతులది.. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ తుమ్మల

Tummala Comments : భూమికి విత్తుకు ఉన్న సంబంధం- కాంగ్రెస్, రైతులది.. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ తుమ్మల

Tummala Comments :


⦿ భూమికి, విత్తనానికి ఉన్న సంబంధం.. రైతు, కాంగ్రెస్ పార్టీది
⦿ బీఆర్ఎస్ ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై రూ.11,145 కోట్ల వడ్డీ భారం
⦿ నాట్లు వేసే సమయం కాదు.. కోతల సమయానికి కూడా రైతు బంధు అందించని బీఆర్ఎస్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది అని.. తమ హయాంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు  తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో 35 శాతం నిదులు.. అంటే రూ. 72 వేల కోట్లను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించామని వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అందించలేకపోయినా.. తొలి ఏడాదిలోనే “రైతు రుణమాఫీ” “వరికి బోనస్” పథకాలను అందించామని, ఇప్పుడు సాగు చేసే రైతులకు భరోసా ఇచ్చే లక్ష్యంలో “రైతు భరోసా”, భూమిలేని నిరుపేద రైతు కూలీలకు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకాలను ప్రారంభించామని ప్రకటించారు.


గతంలో బీఆర్ఎస్ నాయకులు రైతుల గురించి పట్టించుకోలేదన్న మంత్రి తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనులు చూసి ఓర్వలేక తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆగ్రహించారు. బీఆర్ఎస్ పార్టీ నిరాధార ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో రైతు బంధు సాయం ప్రారంభించినప్పటి నుంచి సరాసరి అందరికి అందించేందుకు 5 నెలలు పట్టిందని తెలిపారు. రైతు బంధు సాయాన్ని ఒక ప్రహసనంలా సాగించారని అన్నారు. నాట్లు పూర్తయిన రైతులు ధాన్యాన్ని అమ్మిన తర్వాత కానీ రైతు బంధు అందలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రైతు బంధు సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7,625 కోట్లను ఒక్క నెలలోనే చెల్లించినట్లు తెలిపారు.

రైతులకు అందించే సాయం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకత పాటించలేదని, రాళ్లు, రాప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు సాయం ఇచ్చి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కానీ, ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా నిజమైన రైతులకు సాయాన్ని పెంచి అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రూ. 10 వేలు ఇస్తే.. ప్రస్తుతం 20 శాతం పెంచి ఏడాదికి ఎకరానికి రూ.12 వేల రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

జనవరి 26న ఎంపిక చేసిన 561 మండలాల్లోని 577 గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు రూ.569 కోట్ల రైతు భరోసా సాయం అందించినట్లు తెలిపిన మంత్రి తుమ్మల.. పథకాన్ని మొదలు పెట్టిన 24 గంటల్లోపే ఎకరాలతో నిమిత్తం లేకుండా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జయా అయ్యాయని తెలిపారు. సాగు భూముల సర్వేను పూర్తి చేసి మార్చి 31లోగా మిగిలిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం రైతు కూలీలను పూర్తిగా విస్మరించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో రూ. 6 వేల చొప్పున రూ.10 కోట్ల నిధులను జమ చేసినట్లు వెల్లడించారు.

గతంలో రైతులను మాయ చేశారని, రైతు బంధు పేరు చెప్పి రైతు సంక్షేమానికి ఉపకరించే యంత్ర లక్ష్మి, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీలను నిలిపి వేశారని తెలిపారు. దేశానికి అన్నంపెట్టే రైతు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని.. అందుకే ఆయా పథకాల్ని తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించే పథకాన్ని పునరుద్ధరించి, రైతులకు సబ్సిడీపై యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు.

2020-21 నుంచి నిలిపేసిన పంటల బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు. రైతు వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన RKVY, PMKSY,PKVY వంటి వాటికి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదని అన్నారు. దాంతో.. రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,000 కోట్లు రాలేదని తెలిపారు. పంట నష్ట పరిహారం ఎన్నికల ముందు ఒక్కసారి తప్ప, ఎప్పుడు చెల్లించలేదు. మా ప్రభుత్వం ఎకరానికి రూ. 10,000 చొప్పున నష్టపోయిన సందర్భంలో ఏడాది కాలంలోనే చెల్లించి రైతులను ఆదుకున్నామని ప్రకటించారు.

రైతు వేదికలను నిర్మించి నిరుపయోగంగా వదిలేస్తే రూ. 20.94 కోట్లతో 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైతునేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నిరంతరం శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014-18 వరకు 16,143.94 కోట్లు, 2018-23 వరకు రూ. 11,909.31 కోట్లు రుణ మాఫీ చేశారని.. దాంతో రైతులపై వరుసగా రూ.2,630 కోట్లు, రూ.8515 కోట్ల అధిక వడ్డీ భారం పండిందన్నారు.

Also Read :  శవం ఎముకలు పీకి మరీ క్షుద్రపూజలు.. కుమ్రంబీమ్ జిల్లాలో షాకింగ్ ఘటన

రాజకీయాల కోసం రైతులను ఉపయోగించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్న మంత్రి తుమ్మల.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఆ ప్రాంతానికే రూ. 50 వేల వరకు రుణ మాఫీ చేశారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్ల కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఆర్భాటం చేయడం బీఆర్ఎస్ నైజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రాజకీయాలు చేయలేదన్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×