Secunderabad Railway Station: సౌత్ ఇండియాలో ఎనీ టైం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర మూడు అంతస్తుల కాన్కోర్స్ నిర్మాణం జరుగుతోంది. ఇది 2025-2026 నాటికి పూర్తవనున్నట్లు సమాచారం. ఇవి మాత్రమే కాకుండా అనేక ఆధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్ ఎక్కువ రద్దీని కూడా మేనేజ్ చేసేందుకు రెడీగా ఉంది. అంతేకాకుండా ట్రాక్‌లను విస్తరించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
భారీ స్థాయిలో పునర్‌నిర్మాణ పనులు జరుగుతుండడంతో సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన చాలా రైళ్లను దారి మళ్లించారు. ఇందులో భాగంగానే పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, మల్కాజ్‌గిరి వంటి సమీప స్టేషన్‌లకు డైవర్ట్ చేశారు. డైవర్ట్ అయిన రైళ్ల లిస్ట్, వాటి కొత్త టెర్మినల్‌లు లేదా రూట్‌లు ఎంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం నడుస్తున్న పనుల వల్ల 2025లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్ల రాకపోకల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ నెల నుంచి ఆరు ప్లాట్‌ఫామ్‌లను సుమారు 100–130 రోజుల పాటు మూసే ఛాన్స్ ఉంది. ఈ పనుల కోసం 60–120 రైళ్లను ఇతర టెర్మినల్‌లకు మార్చారు.
రెండు అంతస్తుల స్కై కాన్‌కోర్స్, ప్లాట్‌ఫారమ్ విస్తరణ, కొత్త భవనాల నిర్మాణం వంటి పనుల కోసం సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌లను మూసివేశారు. పది ప్లాట్‌ఫామ్‌లలో ఎనిమిది ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ నేపథ్యంలో రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, ఉమ్దానగర్‌లకు డైవర్ట్ చేశారు.
రైళ్ల డైవర్షన్‌లు ఏప్రిల్ 2025 నుంచి మొదలై, జూలై–ఆగస్టు 2025 వరకు కొనసాగనున్నట్టు సమాచారం. జూన్ 2025 నుంచి మరిన్ని రైళ్లు చర్లపల్లికి చర్లపల్లికి వెళ్లే ఛాన్స్ ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. దాదాపు 60–120 రైళ్లపై దీని ప్రభావం ఉంటుందట. డైవర్ట్ లేదా దారి మళ్లించిన రైళ్లలో కింద ఇచ్చినవి కూడా ఉండే ఛాన్స్ ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
ఇతర టెర్మినల్‌లకు షిఫ్ట్ అయిన రైళ్లు
⦿ సికింద్రాబాద్ – అగర్తల స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
తేదీ: ఏప్రిల్ 28, 2025
⦿ అగర్తల – సికింద్రాబాద్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
తేదీ: మే 2, 2025
⦿ సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
తేదీ: మే 1, 2025
⦿ ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 29, 2025
⦿ సికింద్రాబాద్ – సంత్రాగచ్చి స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 29, 2025
⦿ సంత్రాగచ్చి – సికింద్రాబాద్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 30, 2025
⦿ సికింద్రాబాద్ – దానాపూర్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 26, 2025
⦿ దానాపూర్ – సికింద్రాబాద్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 28, 2025
⦿ హైదరాబాద్ – రక్సాల్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 26, 2025
⦿ రక్సాల్ – హైదరాబాద్ స్పెషల్
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 29, 2025
⦿ విజయవాడ – సికింద్రాబాద్ సతావాహన ఎక్స్‌ప్రెస్ (12713/12714)
కొత్త టెర్మినల్: కాచిగూడ
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
పోర్‌బందర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (20967/20968)
కొత్త టెర్మినల్: ఉమ్దానగర్
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ పూణే – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12025)
కొత్త టెర్మినల్: హైదరాబాద్
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సికింద్రాబాద్ – పూణే ఎక్స్‌ప్రెస్ (12026)
కొత్త టెర్మినల్: హైదరాబాద్
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సికింద్రాబాద్ – మనుగూరు ఎక్స్‌ప్రెస్ (12745)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ మనుగూరు – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12746)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సికింద్రాబాద్ – రేపల్లె ఎక్స్‌ప్రెస్ (17645)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ రేపల్లె – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17646)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సిల్చార్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12513)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సికింద్రాబాద్ – సిల్చార్ ఎక్స్‌ప్రెస్ (12514)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సికింద్రాబాద్ – దర్భాంగ ఎక్స్‌ప్రెస్ (17007)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ దర్భాంగ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17008)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సికింద్రాబాద్ – యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12735)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ యశ్వంత్‌పూర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12736)
కొత్త టెర్మినల్: చర్లపల్లి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సిద్దిపేట – సికింద్రాబాద్ డీఈఎంయూ (77656/77654)
కొత్త టెర్మినల్: మల్కాజ్‌గిరి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ సికింద్రాబాద్ – సిద్దిపేట డీఈఎంయూ (77653/77655)
కొత్త టెర్మినల్: మల్కాజ్‌గిరి
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
సికింద్రాబాద్‌లో ఆగని రైళ్లు
⦿ సంబల్‌పూర్ – నాందేడ్ త్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (20809/20810)
కొత్త రూట్: చర్లపల్లి, మౌలాలి బైపాస్ ద్వారా కామారెడ్డికి
నుంచి: ఏప్రిల్ 25, 2025
⦿ విశాఖపట్నం – హెచ్.ఎస్. నాందేడ్ త్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (20811/20812)
కొత్త రూట్: చర్లపల్లి, మౌలాలి బైపాస్ ద్వారా కామారెడ్డికి
నుంచి: ఏప్రిల్ 26, 2025
⦿ విశాఖపట్నం – సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18503/18504)
కొత్త రూట్: చర్లపల్లి, మౌలాలి బైపాస్ ద్వారా కామారెడ్డికి
నుంచి: ఏప్రిల్ 24, 2025
⦿ నర్సాపూర్ – నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (వారానికి 5 రోజులు) (12787/12788)
కొత్త రూట్: చర్లపల్లి, మౌలాలి బైపాస్ ద్వారా కామారెడ్డికి
నుంచి: ఏప్రిల్ 26, 2025
⦿ నర్సాపూర్ – నాగర్‌సోల్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17231/17232)
కొత్త రూట్: చర్లపల్లి, మౌలాలి బైపాస్ ద్వారా కామారెడ్డికి
నుంచి: మార్చి 28, 2025
ALSO READ: గరీబ్ రథ్ to వందేభారత్.. ఈ రైళ్ల టికెట్ ధరలు ఎంతో తెలుసా?
⦿ వాస్కో డా గామా – జసిదీ ఎక్స్‌ప్రెస్ (17321/17322)
కొత్త రూట్: చర్లపల్లి, అమ్ముగూడ బైపాస్ ద్వారా సనత్‌నగర్, లింగంపల్లికి
నుంచి: మే 12, 2025
⦿ మచిలీపట్నం – సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17207/17208)
కొత్త రూట్: చర్లపల్లి, అమ్ముగూడ బైపాస్ ద్వారా సనత్‌నగర్, లింగంపల్లికి
నుంచి: ఏప్రిల్ 22, 2025
⦿ కాకినాడ పోర్ట్ – సాయినగర్ షిర్డీ త్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17205/17206)
కొత్త రూట్: చర్లపల్లి, అమ్ముగూడ బైపాస్ ద్వారా సనత్‌నగర్, లింగంపల్లికి
నుంచి: ఏప్రిల్ 23, 2025
⦿ పూర్ణా – తిరుపతి ఎక్స్‌ప్రెస్
కొత్త రూట్: మౌలాలి ‘సి’ క్యాబిన్, అమ్ముగూడ, సనత్‌నగర్ ద్వారా (సికింద్రాబాద్ – బేగంపేట్ బైపాస్)
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
⦿ తిరుపతి – పూర్ణా ఎక్స్‌ప్రెస్
కొత్త రూట్: మౌలాలి ‘సి’ క్యాబిన్, అమ్ముగూడ, సనత్‌నగర్ ద్వారా (సికింద్రాబాద్ – బేగంపేట్ బైపాస్)
నుంచి: ఏప్రిల్ 2025లో కొనసాగుతోంది
మరింత ఇన్‌ఫర్మేషన్ కావాలంటే..
దారి మళ్లించిన రైళ్లకు సంబంధించిన వివరాలు కావాలంటే IRCTC లేదా సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్‌సైట్‌లో రైలు షెడ్యూల్‌లు, ప్లాట్‌ఫామ్‌లను చెక్ చేయడం మంచిది. అలాగే చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి వంటి స్టేషన్‌లకు ముందుగా చేరుకుని రైల్వే సిబ్బందిని అడిగి మరిన్ని వివరాలు క్లియర్‌గా తెలుసుకోవచ్చు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.