BigTV English

OTT Movies : పిల్లల కోసం స్పెషల్ సినిమాలు.. ప్రతి మూవీ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

OTT Movies : పిల్లల కోసం స్పెషల్ సినిమాలు.. ప్రతి మూవీ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

OTT Movies : ఈమధ్య వస్తున్న సినిమాలో చిన్న పిల్లలకు సంబంధించినవి కాదు. ఒకప్పుడు పిల్లల కోసం ప్రత్యేకమైన సినిమాలను తెరకెక్కించేవారు. ఇటీవల పిల్లలు చూసే సినిమాలు కనిపించలేదు. అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రత్యేకంగా పిల్లల కోసమే కొన్ని సినిమాలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు పిల్లలు తప్పక చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..


బ్లూ అంబ్రెల్లా.. 

ఈ మూవీ 2007 వచ్చింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పంకజ్ కపూర్ శ్రేయా శర్మ లీడ్ రోల్స్‌లో నటించారు. చిన్నపిల్లలు ఏదైనా వస్తువు మీద కష్టాన్ని పెంచుకుంటే అది పోయినా కూడా దాని గురించి బాధపడుతూ ఉంటారు. అలాగే ఈ మూవీలో ఓ చిన్నారికి తన అంబ్రెల్లాతో ఉన్న అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఓ చిన్నారి తనకు ఇష్టమైన బ్లూ అంబ్రెల్లా దొంగతనానికి గురైతే తిరిగి దాన్ని ఎలా దక్కించుకుందో ఈ స్టోరీలో చూడొచ్చు.. ఆ ఏడాదిలో వచ్చిన సినిమాలలో ఈ సినిమా బెస్ట్ గా నిలిచింది. అందుకే అవార్డును కూడా గెలుచుకుంది.


చిల్లార్ పార్టీ..

2011 లో నేషనల్ అవార్డులను గెలుచుకున్న సినిమాలలో చిల్లార్ పార్టీ కూడా ఒకటి.. ఈ మూవీని డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి కమర్షియల్ హిట్ టాక్ని అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. చిల్లార్ పార్టీ పేరుతో కొందరు చిన్నారులు ఓ గ్రూప్ ఏర్పాటుచేస్తారు. వారు చేసే చిలిపి పనులు, అల్లరి, ఆటపాటలతో సరదాగా ఉంటుంది.. పిల్లలకు బాగా నచ్చుతుంది..

పహునా..

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నిర్మించిన సినిమాలలో పహునా ఒకటి.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్ట్రీనింగ్ కావడమే కాకుండా అవార్డులను గెలచుకుంది. ఈ మూవీలో అనుమోల్ లింగో, ఇషికా, మంజు ఛెత్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఒక ప్రాంతంలో టెర్రరిస్టులు అటాక్ చేస్తే.. ఆ సమయంలో ముగ్గురు చిన్నారులు తప్పించుకుని పారిపోతారు.. ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు.. ఈ మూవీ కూడా అవార్డు గెలుచుకుంది.

ఐయామ్ కలామ్.. 

ఇదొక హిందీ సినిమా.. టైటిల్ కు తగ్గట్టుగానే ఓ చిన్నారి చిన్నప్పటినుంచి ఎత్తాను సైంటిస్ట్ గా మారాలని కలలు కంటాడు. తన కలలను సాకారం చేసుకునేందుకు ఆ చిన్నారి ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు నీలా పాండా తెరకెక్కించారు. ఈ సినిమాకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా హర్ష్ మయార్ నేషనల్ అవార్డు ను దక్కించుకుంది. ఈ సినిమాకు ఇప్పటికీ చిన్న పిల్లలు ఆకర్షితులవుతున్నారు.

ఇవే కాదు ఇలాంటి సినిమాలు మరెన్నో చిన్న పిల్లల కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇలాంటి సినిమాలను అందిస్తుంది. మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి మీ పిల్లలు కూడా ఈ సినిమాలను చూపించండి..

Tags

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×