Snake in Train: రైళ్లలోకి పాములు రావడం తరచుగా చూస్తుంటాం. తాజాగా భోపాల్-జబల్ పూర్ మధ్య నడిచే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో పాము ప్రత్యక్షం అయ్యింది. సీ-1 కోచ్ లోని ఓవర్ హెడ్ స్టోరేజీ రాక్ ల వైపు నల్లరంగు పాము పాకుతున్నట్లు కనిపించింది. వెంటనే ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. సోమవారం నాడు ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్
సోమవారం మధ్యాహ్నం సమయంలో 12061 నెంబర్ గల జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ భోపాల్ నుంచి జబల్పూర్ బయల్దేరింది. కొంత దూరం ప్రయాణించగానే C-1 కోచ్ ప్యాసెంజర్ల లగేజీ మధ్యలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానం వచ్చి ప్రయాణీకులు తమ లగేజీని పక్కకు జరిపారు. వెంటనే అందులో నల్లని పాము కనిపించింది. దాన్ని చూసి ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. సీట్లలో నుంచి లేచి పక్కకు పరిగెత్తారు. విషయం రైల్వే అధికారులకు తెలియడంతో నెక్ట్స్ స్టేషన్ లో స్నేక్ క్యాచర్ ను పిలిచి దాన్ని పట్టుకున్నారు. అనంతరం పామును అడవిలో వదిలిపెట్టారు. ఓ ప్యాసెంజర్ ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.
#WATCH | Panic Grips Passengers After Snake Found Inside C-1 Coach Of Bhopal-Jabalpur Jan Shatabdi Express#Jabalpur #MadhyaPradesh #MPNews pic.twitter.com/9vx16jp53s
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 20, 2024
మూడు రోజుల క్రితం ఇదే రైల్లో పాము
మూడు రోజుల క్రితం ఇదే రైల్లో పాము కనిపించింది. ఓ ప్రయాణీకుడు కూర్చొని ఉండగా ఆయన సీటు కిందికి పాము వచ్చింది. దాన్నిచూసి ప్రయాణీకులు భయపడ్డారు. వరుసగా ఈ రైల్లో పాములు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు భయపడుతున్నారు.
దర్యాప్తుకు ఆదేశించిన అధికారులు
జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో వరుసగా పాములు కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. రైల్వే కోచ్ లను క్లీన్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ పాములు నిజంగానే రైల్లోకి వస్తున్నాయా? లేదంటే ప్రయాణీకులను భయపెట్టేందుకు ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? అనే విషయం పైనా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు వెస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన జబల్పూర్ CPRO హర్షిత్ శ్రీవాస్తవ వెల్లడించారు.
గత కొద్ది నెలలుగా పలు రైళ్లలో పాములు
గత కొద్ది నెలలుగా ఇప్పటికే రెండు మూడు రైళ్లలో పాములు కనిపించాయి. సెప్టెంబర్ 25న జైపూర్ నుంచి జబల్పూర్ కు వస్తున్న దయోదయ ఎక్స్ ప్రెస్ లో కూడా పాము కనిపించింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు పశ్చిమ మధ్య రైల్వే సంస్థలో నడుస్తున్న పలు రైళ్లలో పాములు కనిపించిన సంఘటనలు ఉన్నాయి. క్లీనింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాములు కనిపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
#WATCH | MP: Snake Seen In A1 Coach Of Ajmer-Jabalpur Dayodaya Express#MadhyaPradesh #MPNews pic.twitter.com/Jv6x0o85Ei
— Free Press Madhya Pradesh (@FreePressMP) September 25, 2024
Read Also: కాశ్మీర్‌కు నేరుగా వందే భారత్ రైలు.. మొదలయ్యేది అప్పటి నుంచే, టికెట్ బుకింగ్స్ కు రెడీ అవ్వండి!