Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. దీనిని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అందుకే తమ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోహీరోయిన్లు సైతం ఈ రియాలిటీ షోనే ఎంచుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేయడంతో పాటు హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్స్‌తో కలిసి సందడి చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి విశ్వక్ సేన్ కూడా యాడ్ అయ్యాడు. విశ్వక్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా దానిని ప్రమోట్ చేయడం కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. కంటెస్టెంట్స్‌తో కలిసి సరదాగా సమయాన్ని గడిపాడు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
కొత్త కంటెస్టెంట్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఆటో వేసుకొని వచ్చాడు విశ్వక్ సేన్. తనను చూడగానే కంటెస్టెంట్స్ అంతా వెళ్లి హగ్ చేసుకున్నారు. తాను కొత్త కంటెస్టెంట్ అని చెప్పగానే నిజమే అనుకొని అవినాష్ షాకయ్యాడు. కానీ టేస్టీ తేజ మాత్రం తాను మెకానిక్ రాకీ అని తెలుసంటూ కౌంటర్ వేశాడు. హౌస్ లోపలికి వెళ్లి కంటెస్టెంట్స్‌తో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు విశ్వక్ సేన్. అసలు ‘మెకానిక్ రాకీ’ స్టోరీ ఏంటి అని అవినాష్ అడగగా.. ‘‘మలక్‌పేట్‌లో ఒక మెకానిక్ స్టోరీ’’ అని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘‘నాకు మీ టైమ్ పెంచే పవర్ ఇచ్చారు. అది ఇస్తే మరి నాకేంటి’’ అని అడిగాడు విశ్వక్. ‘‘మీకు ఏం కావాలో చెప్పండి’’ అంటూ సిగ్గుపడుతూ నిలబడింది రోహిణి.
Also Read: డేంజర్ జోన్ లో బెస్ట్ ఫ్రెండ్స్.. దెబ్బేసిన మాజీ కంటెస్టెంట్స్..!
ఒకటే మ్యూజిక్
ఇక నిఖిల్ గురించి, తన ఫ్లర్టింగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘మీ లైఫ్ చాలా బాగుంది బ్రో. అందరూ బిగ్ బాస్ వచ్చి చాలా మిస్ అవుతున్నారు. కానీ మీకైతే బయట మ్యూజిక్, లోపల మ్యూజిక్’’ అని ముక్కుసూటిగా చెప్పేశాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత విశ్వక్ సేన్, రోహిణి, అవినాష్ కలిసి ఒక స్కిట్ చేసి అలరించారు. ఈ స్కిట్‌లో మెకానిక్ రాకీ అసిస్టెంట్ పాత్రలో అవినాష్ నటించాడు. తన దగ్గరకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందంటూ వస్తుంది రోహిణి. దానికి రూ.10 వేలు ఫీజ్ అడుగుతాడు అవినాష్. రూ.3 వేలు ఇస్తా కానిచ్చేయ్ అంటుంది రోహిణి. అప్పుడే మెకానిక్ రాకీగా విశ్వక్ సేన్ ఎంటర్ అవుతాడు. రోహిణిని చూసి షాకవుతాడు.
రోహిణితో ఫ్లర్టింగ్
రోహిణికి ఫ్రీగా డ్రైవింగ్ నేర్పిస్తానని మాటిస్తాడు విశ్వక్ సేన్. ‘‘ఫ్రీగా నేర్చుకునే దానిలాగా కనిపిస్తున్నానా? రూ.5 వేలకు మించి ఇవ్వను’’ అని రోహిణి అనగానే వెంటనే ఇవ్వమని అంటాడు విశ్వక్. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా ఇస్తామని రోహిణి షాక్‌లో ఉండగా.. ‘‘నేను అడిగింది నీ అయిదు వేళ్లు నా అయిదు వేళ్లలో పెట్టమని’’ అంటూ రోహిణితో ఫ్లర్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఫైనల్‌గా కంటెస్టెంట్స్ అంతా ‘మెకానిక్ రాకీ’ పాటకు విశ్వక్ సేన్‌తో కలిసి స్టెప్పులేస్తారు.