BigTV English

TTD News: తిరుమలలో 10 రోజుల పాటు ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

TTD News: తిరుమలలో 10 రోజుల పాటు ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

TTD News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారా.. జనవరి నెలలో వెళ్లాలని భావించారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన జారీ చేశారు.


వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వ‌ద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు స‌మ‌న్వయంతో విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.


అదేవిధంగా తదుపరి మిగిలిన రోజులకు 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా భక్తులకు పలు సూచనలిస్తూ ఓ ట్వీట్ చేశారు.

Also Read: AP Govt: ఏపీలో ఆ స్కీమ్ ప్రారంభం.. ఆ బాధలు పోయినట్లే!

సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేయడం జరిగిందన్నారు. అయితే ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు టీటీడీ రద్దు చేసింది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×