Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డేకి గత రెండేళ్లుగా కలిసిరాలేదు అనే చెప్పాలి. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అన్న వారే ఆమెను ఐరెన్ లెగ్ అనేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ చిన్నది ఏ సినిమా చేసినా అది పరాజయం పాలవుతూనే ఉంది. ఇక ఈ ఏడాది పూజా సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్స్ మీద పడింది. దొరికిందే టైమ్ కదా అనుకోని కుటుంబంతో సహా దేశాలు చుట్టేసింది. అంతా అయ్యాకా.. ఇప్పుడిప్పుడే అమ్మడు సినిమాలను సెట్ చేసే పనిలో పడింది.
ఇక ఈ నేపథ్యంలోనే పూజా.. సూర్య సరసన రెట్రో సినిమాలో ఛాన్స్ పట్టేసింది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో పూజా లుక్ పై విమర్శలు చుట్టుముట్టాయి. అంతకు ముందు ఉన్నంత న్యాచురల్ లుక్ లేదని నెటిజన్స్ పెదవి విరిచారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
Anil Ravipudi: దేన్నీ వదలడం లేదుగా.. అన్ని వాడేసున్నావ్ గా.. ఏం వాడకం అయ్యా బాబు
ఈ సినిమా కాకుండా పూజా.. ఒక హర్రర్ సినిమాలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. హర్రర్ అనగానే అందరి దృష్టిలోకి వచ్చే ఒకే ఒక పేరు రాఘవ లారెన్స్. ఆయన దర్శకత్వం వహించి నటించిన సినిమా కాంచన. అంత సీన్ గా ఈ సినిమాను ఎవరు మర్చిపోలేరు. సాధారణంగా దెయ్యం సినిమాలు రాత్రిపూట చూస్తే నిద్రపట్టదు. కానీ లారెన్స్ సినిమాలు ఉదయం చూసినా కూడా భయంతో వణికిపోతూ ఉండడమే. కాంచన సినిమాను లారెన్స్ ఫ్రాంచైజీలు గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మూడు భాగాలు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి.
కాంచన, కాంచన 2 , కాంచన 3 సినిమాలు వెన్నులో వణుకుపుట్టించేలా ప్రేక్షకులను భయపెట్టాయి. ఇక ఈ మూడు సినిమాల్లో రాఘవ లారెన్స్ నే దెయ్యంగా కనిపించాడు. హీరోయిన్స్ లో అప్పుడప్పుడు దెయ్యం దూరినా వారు కూడా అంతే భయపెట్టారు. నిత్యా మీనన్, తాప్సీ గంగ సినిమాలో తమ శక్తి మేరకు భయపెట్టారు. కాంచన 3 లో కూడా ఒక హీరోయిన్ దెయ్యంలా భయపెట్టింది.
Dil Raju: సీఎంతో జరిగిన మీటింగ్ చాటుమాటున జరిగింది కాదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజు క్లారిటీ
ఇక ఇప్పుడు కాంచన 4 లో ప్రేక్షకులను భయపెట్టడానికి పూజా సిద్ధమవుతుందని టాక్ నడుస్తోంది. ఈ విషయం తెలియడంతో ట్రోలర్స్.. పూజాపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. పూజా పాపను చూస్తే యాక్టింగ్ ఎలా చేస్తుంది అనిపిస్తుంది. ఇక దెయ్యంగా భయపెడుతుంది అంటే అస్సలు నమ్మేలానే లేదు అని కొందరు. అమ్మడు మేకప్ వేయకుండా కనిపిస్తే అందరూ భయపడతారు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే కనుక నిజమైతే.. పూజాను లారెన్స్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.