South Central Railway: రైల్వే సంస్థలో ఖాళీలను పూర్తి చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(SCR) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుట్లు ప్రకటించింది. 6 స్పెషల్ ట్రైన్స్ ద్వారా 42 ట్రిప్పులు నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 24 నుంచి 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి.
స్పెషల్ ట్రైన్లు, నడిచే రూట్లు
⦿ కాకినాడ – తిరుపతి – కాకినాడ ప్రత్యేక రైలు
07107/07108 నెంబర్ గల ఈ రైలు మొత్తం 8 ట్రిప్పులు నడుస్తుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, కొత్త గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు ఉదయం 6:30 గంటలకు కాకినాడ స్టేషన్‌లో బయల్దేరి సాయంత్రం 6:15 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి రాత్రి 7:45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9:54 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్ 24, 26, 28, 29 తేదీల్లో నడుస్తుంది.
⦿ గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు ప్రత్యేక రైలు
07101/07102 నెంబర్ గల ఈ ప్రత్యేక రైలు మొత్తం 10 ట్రిప్పులు నడవనుంది. నవంబర్ 24, 25, 26, 28, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మంగళగిరి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట, జనగాం, ఆలేరు, భోంగీర్, చెర్లపల్లి, మౌలా అలీ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలు జనరల్ అన్ రిజర్వుడ్ బోగీలతో నడవనుంది. గుంటూరులో ఉదయం 8 గంటలకు బయల్దేరి సాయంత్రం 4:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 7:45 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
⦿ కాచిగూడ – కర్నూలు- కాచిగూడ ప్రత్యేక రైలు
07109/07110 నెంబర్ గల ఈ ట్రైన్ మొత్తం 6 ట్రిప్పులు నడవనుంది. ఈ రైలు ఫలక్ నుమా, ఉమ్దానగర్, తిమ్మాపూర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, శ్రీరామనగర్, గద్వాల్ స్టేషన్లలో ఆగుతుంది. నవంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
⦿ నాందేడ్ – తిరుపతి – నాందేడ్ ప్రత్యేక రైలు
07105/07106 నెంబర్ గల ఈ రైలు రెండు ట్రిప్పులు నడపనుంది. ఈ రైలు ముద్ ఖేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల స్టేషన్లలో ఆగుతుంది. నవంబర్ 23న మధ్యాహ్నం 12:25 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 06:25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 24న తిరుపతి నుంచి మధ్యాహ్నం 3:35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:25 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
⦿ హుబ్లీ – కర్నూలు – హుబ్లీ ప్రత్యేక రైలు
07315/07316 నెంబర్ గల ఈ రైలు 8 ట్రిప్పులు నడవనుంది. ఈ రైలు నవంబర్ 24, 25, 26, 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. గడగ్, కొప్పల్, హోస్పేట్, తోరణగల్లు, బళ్లారి, గుంతకల్, ధోనే స్టేషన్లలో ఆగుతుంది. హుబ్లీలో రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కర్నూలుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలులో ఉదయం 7:30 గంటలకు బయల్దేరి సాయంత్రం 4:15 గంటలకు హుబ్లీకి చేరుకుంటుంది.
⦿ కరీంనగర్ – కాచిగూడ – కరీంనగర్ ప్రత్యేక రైలు
07103/07104 నెంబర్ గల ఈ రైలు మొత్తం 8 ట్రిప్పులు నడపనుంది. నవంబర్ 24, 25, 26, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గంగాధర, లింగంపేట జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, అకనపేట్, వడియారం, మనోహరాబాద్, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్‌గిరి, సీతాఫల్‌మండి స్టేషనల్లో ఆగుతుంది.
Read Also: టికెట్ లేకుండానే ఈ రైల్లో హాయిగా వెళ్లొచ్చు! ఈ స్పెషల్ ట్రైన్ మన దేశంలోనే ఉంది తెలుసా?