నార్త్ ఇండియాలో ఇప్పటికే ఏసీ లోకల్ రైలు అందుబాటులోకి రాగా, ఇప్పుడు సౌత్ లోనూ ప్రారంభం అయ్యింది. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైలు చెన్నై బీచ్- చెంగల్పట్టు కారిడార్ లో ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. సమ్మర్ లో ఈ రైలును ప్రారంభించడం పట్ల ప్యాసింజర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సౌత్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రైలు సాధారణ ఎలక్ట్రిక్ మల్టిఫుల్ యూనిట్స్ కంటే మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది.
ఒకేసారి 500 మంది ప్రయాణించే అవకాశం
ఇక చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ అత్యాధునిక ఏసీ ఎంఎంటీఎస్ రైలు తయారయ్యింది. 12 కార్ల AC EMUలో ఒకేసారి 5 వేల మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అధిక సామర్థ్యంతో మెట్రో లాంటి సౌకర్యాన్ని అందించే అనేక అత్యాధునిక ఫీచర్లను ఈ రైలు కలిగి ఉంది. ప్రయాణీకులకు మరింత ఆహ్లాదకర ప్రయాణం అందించడమే లక్ష్యంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏసీ ఎంఎంటీఎస్ లో అదనపు ఫీచర్లు
ఇక ఈ అత్యాధునిక ఏసీ ఎంఎంటీఎస్ లో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, స్టెయిన్ లెస్ స్టీల్ సీటింగ్, పనోరమిక్ వైడ్ గ్లాస్ విండోస్, అద్భుతమైన లైటింగ్ సిస్టమ్, GPS-ఆధారిత LED డిస్ ప్లేలు, ప్రయాణీకుల భద్రత కోసం ప్రతి కోచ్ లో సీసీ కెమెరాలు, అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకుల టాక్ బ్యాక్ సిస్టమ్, ఎలాంటి అంతరాయం లేకుండా కదిలేలా సీలు చేసిన గ్యాంగ్ వేలు ఉన్నాయి. ఈ రైలులో 35 శాతం వరకు పవర్ ను సేవ్ చేసే శక్తి కలిగిన ఎలక్ట్రో న్యూమాటిక్ బ్రేక్‌లు, బెస్ట్ రైడింగ్ సౌకర్యం కోసం ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా అమర్చారు.
Vanakkam Chennai!
Say hello to the city’s FIRST 12-coach AC EMU zipping between Chennai Beach ↔️ Chengalpattu!
Your ride has:
* Automatic Doors – Smooth in, smooth out
* CCTV – Safety’s always on track
* Full AC – A breeze, not a sweatAll aboard the cool express, Chennai! pic.twitter.com/Ph0r8LF02K
— Ministry of Railways (@RailMinIndia) April 19, 2025
ముంబైలో తొలి ఏసీ ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభం
ఇక దేశంలో తొలిసారి ముంబైలో ఏసీ ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ ఈ రైలు సూపర్ సక్సెస్ అయ్యింది. ఆఫీసులకు వెళ్లే వాళ్లు, ముఖ్యంగా మహిళా ప్రయాణీకులు ఈ సేవలను అద్భుతంగా వినియోగించుకున్నారు. ముంబైలో ఏసీ లోకల్ రైలు సేవలు సక్సెస్ కావడంతో సౌత్ ఇండియాలోనూ ఈ రైలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చెన్నై బీచ్- చెంగల్పట్టు మార్గంలో ఈ రైలును ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లోనే చెన్నై బీచ్- తాంబరం మార్గంలోనూ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నాడు ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవన్నారు.
ఏసీ ఎంఎంటీఎస్ టికెట్ ధరల వివరాలు
చెన్నైలో ప్రారంభం అయిన ఏసీ రైలుకు సంబంధించి టికెట్ ధరల వివరాలను దక్షిణ రైల్వే విడుదల చేసింది. కనీస టికెట్ ధర రూ. 35 కాగా, అత్యధిక ధర రూ. 105గా నిర్ణయించింది. 10 కి.మీ దూరానికి కనీస టికెట్ ధర రూ. 35 ఉంటుంది. ఇక 56 నుంచి 60 కి.మీ దూరానికి రూ. 105 ఛార్ట్ ఉంటుంది. నెలవారీ సీజన్ టికెట్ దూరాన్ని బ్టి రూ. 620 నుంచి రూ. 2115 వరకు ఉంటుంది. ఇక చెన్నైలో ఈ రైలుకు వచ్చే ఆదరణను బట్టి హైదరాబాద్ లోనూ ఏసీ ఎంఎంటీఎస్ ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: కేరళకు వందేభారత్ స్లీపర్, ఏ రూట్ లో నడుస్తుందంటే?