BigTV English

IPL Cheerleaders Salary : ఐపీఎల్ చీర్ గర్ల్స్ జీతం ఎంతో తెలుసా… షాక్ అవ్వాల్సిందే

IPL Cheerleaders Salary : ఐపీఎల్ చీర్ గర్ల్స్ జీతం ఎంతో తెలుసా… షాక్ అవ్వాల్సిందే

IPL Cheerleaders Salary :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కొనసాగుతోంది. ఇక ఈ సమయంలో ఒకదాని తరువాత ఒకటి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 18వ సీజన్ లో చాలా మంది కొత్త ఆటగాళ్లు తమదైన ముద్ర వేశారు. ముఖ్యంగా 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆడిన తొలి బంతికే సిక్స్ బాది రికార్డు నెలకొల్పాడు.  అయితే ఐపీఎల్  టోర్నమెంట్ టాప్ ప్లేయర్లు ఎంత ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారో.. అంతకంటే ఎక్కువగా చీర్ లీడర్స్ తమ డ్యాన్స్ తో ఆకట్టుకుంటారు. మ్యాచ్ సమయంలో సిక్స్, ఫోర్ కొట్టినప్పుడూ.. అలాగే వికెట్ పడినప్పుడు అభిమానులతో పాటు చీర్ లీడర్స్ తమ టీమ్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. 


Also Read : BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో భారీ మార్పులు.. తప్పించిన ఐదుగురు ఎవరంటే..?

 


ఇక ఐపీఎల్ కి మరింత ఆకర్షణను తీసుకొస్తుంది. ఇది మాత్రమే కాకుండా చీర్ లీడర్స్ కూడా మ్యాచ్ సమయంలో వాతావరణానికి ఉత్సాహాన్ని జోడిస్తారు. చాలా మందికి ఈ చీర్ లీడర్స్ ని ఎంపిక చేస్తారు. వారికి ఎంత జీతం వస్తుందనే వివరాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఐపీఎల్ లో కనిపించే చీర్ లీడర్స్ లో ఎక్కువ మంది రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి వచ్చారు. అది మాత్రమే కాకుండా కొంత మంది భారతీయులు కూడా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. చాలా ఫ్రాంచైజీలు విదేశీ చీర్ లీడర్స్ ని ఇష్టపడతాయి. చీర్ లీడర్స్ జీతం గురించి చెప్పాలంటే వేర్వేరు ప్రాంఛైజీలు చీర్ లీడర్స్ కి వేర్వేరు జీతాలు చెల్లిస్తాయి.  అలాగే వీరికి బోనస్ కూడా లభిస్తుంది. 

 

కోల్ కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్స్ కి మ్యాచ్ కి రూ.24,000 నుంచి 25,000 వరకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రూ.20వేలు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.17వేలు, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.12వేల నుంచి 15వేల వరకు చెల్లిస్తున్నాయి. దీంతో పాటు జట్టు బాగా రాణిస్తే.. చీర్ లీడర్స్ కి బోనస్ లు కూడా లభిస్తాయి. జీతంతో పాటు ఫ్రాంచైజీ చీర్ లీడర్స్ కి కొన్ని సౌకర్యాలను అందిస్తారు. ప్రయాణ ఖర్చులు, హోటల్ బస, ఆహారం, వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ఐపీఎల్ చీర్ లీడర్స్ ఎంపిక ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. చీర్ లీడర్స్ కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఆడిషన్లుంటాయి. ఆ సమయంలో వారి డ్యాన్స్ స్కిల్స్ పరీక్షించబడుతాయి. ఐపీఎల్ లో చీర్ లీడర్ గా మారాలంటే గొప్ప డ్యాన్స్ మూమెంట్స్ వచ్చి ఉండాలి. చీర్ లీడర్స్ కి మంచి శక్తి ఉండటం కూడా ముఖ్యమే. వీటితో పాటు వారి ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా పరిశీలిస్తారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చీర్ లీడర్స్ ని నేరుగా ఎంపిక చేయవు. ఇందుకోసం ఏజెన్సీ సహాయం కూడా తీసుకుంటారు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×