Summer Trips 2025: పిల్లలకు సమ్మర్ హాలీడేస్ రాబోతున్నాయి. ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన వారికి, కాస్త రిలాక్స్ కలిగించేలా పేరెంట్స్ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ సమ్మర్ లో వెకేషన్స్ ప్లాన్ చేస్తే, వేసవి తాపం నుంచి బయటపడటంతో పాటు ప్రకృతి అందాలను చూసి మైమరచిపోవాలనుకుంటే కొన్ని బెస్ట్ ప్లేసెస్ కు తప్పకుండా వెళ్లండి. ఆహ్లాదకరమైన బీచ్ లు, పొగ మంచుతో కూడిన పచ్చిక భూములు, తీర ప్రాంత సొగసులు చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇంతకీ ఆ ప్లేసెస్ ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సమ్మర్ బెస్ట్ 5 వెకేషన్ ప్లేసెస్
⦿ ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్
వేసవి మంటల నుంచి దూరంగా చల్లగా, హాయిగా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఖజ్జియార్ బెస్ట్ డెస్టినేషన్. పచ్చని పచ్చిక బయళ్ళు, పైన్ అడవులు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడే వారికి ఈ ప్రాంతం చాలా నచ్చుతుంది. ఖజ్జియార్ సరస్సు దగ్గర పిక్నిక్ ఆస్వాదించడంతో పాటు పచ్చిక బయళ్ల మీద గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. ధౌలాధర్ పర్వత శ్రేణి ఉత్కంఠభరితమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. మండు వేసవిలోనూ ఇక్కడ చల్లని గాలులు వీస్తూ సాంత్వన కలిగిస్తాయి.
⦿ మజులి, అస్సాం
బ్రహ్మపుత్ర నది మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ద్వీపం పచ్చదనం, సాంప్రదాయ అస్సామీ సంస్కృతి, పురాతన మఠాలతో విరాజిల్లుతోంది. ప్రసిద్ధ నియో వైష్ణవ సత్రాలకు నిలయంగా ఉంది. మజులిలో శతాబ్దాలుగా సంరక్షించబడిన అరుదైన జీవన విధానం కనిపిస్తుంది. ఈ అందమైన ద్వీపం ప్రతి ఏటా కోత కారణంగా నెమ్మది నెమ్మదిగా కుంచించుకుపోతోంది. మరికొద్ది సంవత్సరాల్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు వెళ్లాలని ఉంటే, వెంటనే ప్లాన్ చేసుకోండి.
⦿ గోకర్ణ, కర్ణాటక
గోవా లాంటి అందాలను ఇష్టపడే వారు, టూర్ ఖర్చు తక్కువ కావాలి అనుకునే వారికి గోకర్ణ బెస్ట్ ఆప్షన్. ఈ తీరప్రాంత పట్టణం అద్భుతమైన బీచ్ లు, ఫ్రెండ్లీ కేఫ్ లు, రిలాక్స్డ్ వైబ్స్ ఆకట్టుకుంటాయి. కుడ్లే, ఓం బీచ్‌లు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇక్కడ సీఫుడ్ చాలా ఫేమస్. అరేబియా సముదాన్ని చూస్తూ, తాజా చేపల కూర రుచి చూస్తూ మైమరిచిపోవచ్చు.
⦿ వాగమోన్, కేరళ
పశ్చిమ కనుమలలో ఉన్న వాగమోన్ మున్నార్ చల్లదాన్ని ప్రతిబింబిస్తుంది. రోలింగ్ టీ తోటలు, పొగమంచు కొండలు, మనోహరమైన పచ్చికభూములు, ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. తంగల్ పారా పైకి హైకింగ్ చేస్తున్నా, లోయలపై పారాగ్లైడింగ్ చేస్తున్నా ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ హిల్ స్టేషన్ లో మండు వేసవిలోనే వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Read Also: ఈ పక్షులు ఎగురుతూ నిద్రపోతాయట.. మరి దారి ఎలా తెలుస్తుంది?
⦿ కద్మత్ ద్వీపం, లక్షద్వీప్
మాల్దీవులకు ప్రత్యామ్నాయం లక్ష ద్వీప్. ఇక్కడ ఉన్న కద్మత్ ద్వీపం అద్భుతమైన ఇసుక బీచ్‌లు ఆకట్టుకుంటాయి. లక్షద్వీప్ లోని ఈ చిన్న పగడపు దీవి డైవింగ్, స్నార్కెలింగ్, బీచ్ దగ్గర పుస్తకాలు చదువుతూ విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. రద్దీ లేకుండా ప్రశాంతంగా బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం బెస్ట్. వేసవిలో ఇక్కడికి వెళ్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
Read Also: సముద్రం పక్క నుంచి వెళ్లే ఈ రైల్ రూట్స్ ఇండియాలో ఎక్కడున్నాయో తెలుసా?