ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అలాంటి విశేషాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని పక్షలు గాల్లో విహరిస్తూ నిద్రపోతాయి. ఈ అద్భుతమైన సామర్థ్యాన్ని కేవలం కొన్ని పక్షలు మాత్రమే కలిగి ఉన్నాయి. కొన్నిసార్లు ఈ పక్షులు నిద్రించేందుకు చెట్లు, కొమ్మలు లేకపోయినా గాల్లోనే నిద్రపోగలవు. ఈ ప్రత్యేక విధానాన్ని యూనిహెమిస్పెరిక్ స్లో వేవ్ స్లీప్ అంటారు. చాలా వరకు ఈ పద్దతిని వలస వెళ్లే పక్షులు పాటిస్తాయి. సమయాన్ని ఆదా చేసుకునేందుకు తరచుగా ఈ పక్షులు ప్రయాణంలోనే నిద్రపోతుంటాయి. ఈ అసాధారణ లక్షణాన్ని కలిగి ఉన్న కొన్ని పక్షుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ స్వాలో
బార్న్ సాల్వో సౌకర్యవంతమైన గూడును కట్టుకుంటుంది. కానీ, వలస వెళ్లే సమయంలో ఈ పక్షి వేలాది కిలో మీటర్లు ప్రయాణం చేస్తుంది. ఆ సమయంలో ఆగి రెస్ట్ తీసుకునే సమయం లేక, ప్రయాణం మధ్యలోనే చిన్న చిన్న నిద్ర పోతుంది. టైమ్ ను సేవ్ చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
⦿ సాండ్‌పైపర్
సాండ్ పైపర్లు కూడా ప్రయాణ సమయంలో నిద్రపోతాయి. సముద్రాలు, నదుల మీదుగా ప్రయాణించే సమయంలో అవి నిద్రపోతాయి.
⦿ నార్త్ వీటర్
నార్త్ వీటర్ వలస సమయంలో ఖండాంతరాలకు వెళ్తుంది. వేల కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయంలో నిద్రపోతాయి. ఎడారులు, పర్వత ప్రాంతాలలో ఆగకుండా శక్తిని ఆదా చేసుకోవడానికి నిద్రపోతాయి.
⦿ గ్రేట్ స్నిప్
గ్రేట్ స్నిప్ లు కూడా చాలా దూరాలకు వసల వెళ్తాయి. ప్రయాణ సమయంలో వేగాన్ని కొనసాగించడానికి చిన్న చిన్న నిద్రలు తీసుకుంటాయి.
⦿ ఫ్రిగేట్ బర్డ్
ఇవి సముద్ర పక్షలు. ఇవి కూడా గాల్లో ఎగురుతూ నిద్రపోయే గుణాన్ని కలిగి ఉంటాయి.
⦿బార్ టెయిల్డ్ గాడ్‌విట్
ఈ పక్షలు 7000 మైళ్ల వరకు ప్రయాణిస్తాయి. దేశాలను దాటి వసల వెళ్తాయి. ఆ సమయంలో విశ్రాంతి కోసం నిద్రపోతూ ఉంటాయి.
⦿ ఆర్కిటిక్ టెర్న్
యూరప్, ఆసియా, ఉత్తర అమెరికాలోని ఆర్కిటిక్, సబ్ ఆర్కిటిక్ ప్రాంతాలలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. గాలిలో నిద్రపోవడం వల్ల ఈ పక్షులు తమ ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాయి. ఈ పక్షలు ఒక సంవత్సరంలో 96,000 కిలోమీటర్లు సుమారు 59,650 మైళ్ళ వరకు ప్రయాణిస్తాయి. ఈ పక్షులు 30 సంవత్సరాల వరకు జీవించగలవు.
⦿ ఆల్బాట్రాస్
ఆల్బాట్రాస్ కూడా గాలిలో నెలల తరబడి ప్రయాణిస్తాయి. ఇది ప్రత్యేకమైన నిద్ర పద్దతిని ఫాలో అవుతుంది. మెదడులోని ఒక భాగం విశ్రాంతి తీసుకుంటూ, మరొకర భాగం యాక్టివ్ గా ఉంటుంది. ఈ పద్దతిని పాటిస్తూ రోజుల తరబడి ప్రయాణిస్తుంటాయి. ఆకలి దప్పికలు మర్చిపోయి నెలల తరబడి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి. అలాంటి సమయంలో చిన్న చిన్న నిద్రపోతూ మరింత శక్తిని కూడగట్టుకుంటాయి.
Read Also: మాజీ ప్రేయసి తండ్రి అస్తికలు దొంగిలించిన ప్రియుడు.. అలా చేస్తే తిరిగిస్తాడట!
Read Also: మొసళ్లను పెంచుకుంటారా? వందల టన్నులు వేలానికి సిద్ధం.. డెలీవరీ బాధ్యతలు మీవే!