Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. టీమిండిగా తరఫున 1989 ఆగస్టు నెలలో పాకిస్తాన్ తో టెస్ట్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్.. అదే ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్ లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. అసాధారణ ప్రతిభతో వాటన్నింటినీ దాటుకొని.. శతకాల వీరుడిగా ప్రపంచంలో ఏ క్రికెటర్ కి సాధ్యం కానీ ఘనతను సాధించాడు.
Also Read: MS dhoni: ఫ్యాన్స్ టార్చర్ భరించలేకే… ధోని ఆడుతున్నాడు
తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి మొదటి 15 మ్యాచ్లలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయిన ఈ ముంబై స్టార్ బ్యాటర్.. 1990 లో ఇంగ్లాండ్ గడ్డమీద తన సెంచరీల ప్రయాణానికి నాంది పలికాడు. అప్పటినుండి శతకాల మీద శతకాలు బాదుతూ వచ్చాడు. ఆసియా 2012 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ మీద మీర్పూర్ వేదికగా 100వ సెంచరీ సాధించాడు సచిన్ టెండూల్కర్.
మొత్తంగా టీమ్ ఇండియా తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండూల్కర్.. 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీల సాయంతో 15,921 పరుగులు చేశాడు. అలాగే 463 వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేసి 18426 పరుగుల స్కోర్ చేశాడు. ఇక తన కెరీర్ లో ఒకే ఒక అంతర్జాతీయ టి-20 ఆడిన సచిన్.. ఇందులో 10 పరుగులు చేశాడు. తన కెరీర్ లో సెంచరీల మీద సెంచరీలు చేసి క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
మొత్తంగా తన కెరీర్లో 100 శతకాలు బాదిన సచిన్.. 168 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే సచిన్ టెండూల్కర్ మిస్ చేసుకున్న శతకాల సంఖ్య కూడా భారీగానే ఉంది. చాలాసార్లు 90 కి పైగా పరుగులు చేసి పెవిలియన్ చేరాడు మాస్టర్ బ్లాస్టర్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 సార్లు సెంచరీలను మిస్ చేసుకున్న ఏకైక ప్లేయర్ సచిన్ టెండూల్కర్.
Also Read: Mahvash: ధోని దెబ్బకు… చాహల్ కు లైన్ క్లియర్… ప్రియురాలు ముద్దులు ఒకటే తక్కువ
1994లో శ్రీలంక పైన 96 పరుగులు చేసి అవుట్ అయిన సచిన్.. 2011 లో వెస్టిండీస్ పై 94 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 1994 నుండి 2011 మధ్య కాలంలో ఇలా 90 కి పైగా పరుగులు చేసి 28 సార్లు సెంచరీలను మిస్ చేసుకున్నాడు. ఈ 28సార్లు కూడా సచిన్ సెంచరీలను సాధించి ఉంటే.. అతడి సెంచరీల సంఖ్య 128 కి చేరుకునేది. ఇలా అత్యధిక సార్లు సెంచరీలను మిస్ చేసుకున్న జాబితాలో కూడా మొదటి స్థానంలో నిలిచాడు సచిన్. ఇలా క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ అభిమానులు ఎన్ని తరాలైనా మర్చిపోలేరు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">