India’s First Vertical Lift Sea Bridge: గత దశాబ్ద కాలంగా భారతీయ రైల్వేలో పెను మార్పుల చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీని అందింపుచ్చుకుంటూ రైల్వే సంస్థ అద్భుతాలను ఆవిష్కరిస్తున్నది. రీసెంట్ గా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయగా, తాజాగా అద్భుత ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా రూపొందిన ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి రెడీ అవుతున్నది. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ని నిర్మించారు.
జనవరిలో అందుబాటులోకి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్
రామేశ్వరంలోని పంబన్ రైల్వే బ్రిడ్జిని బ్రిటీష్ కాలంలో(1914)లో నిర్మించారు. ఇప్పటికే 100 ఏండ్లు పూర్తి కావడంతో తుప్పు పట్టింది. ఈ నేపథ్యంలో రైల్వే సేవలను నిలిపివేశారు. 2019 మార్చిలో ఈ వంతెన నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) 2.08-కి. మీ పొడవున్న వంతెనను నిర్మించింది. ఇది బ్రిటీష్ వాళ్లు నిర్మించిన వంతెనకు సమాంతరంగా నిర్మించారు. ఇక సముద్ర రవాణాకు అనుకూలంగా వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ను నిర్మించారు. ఈ బ్రిడ్జిని జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది.
ఓడలు వెళ్లేలా వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ నిర్మాణం
పంబన్ రైల్వే బ్రిడ్జి నడుమ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా ఓడలు, పడవలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆ సమయంలో ఈ బ్రిడ్జి నిటారుగా పైకి ఫ్ట్ అవుతుంది. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రిడ్జి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వంతెన రైలు ప్రయాణానికి అనుకూలంగా మారడంతో పాటు పర్యాటకులను బాగా ఆకర్షించనుంది. భారతీయ ఇంజినీరింగ్అద్భుతాలో ఒకటైన ఈ వంతెన.. ఇండియన్ ఇంజనీర్ల కృషికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఈ బ్రిడ్జి వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ బ్రిడ్జితో భారత్ మరోసారి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని మంత్రి అశ్వనీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.
India's First Vertical Lift Railway Sea Bridge at Pamban!
Catch a glimpse of the iconic Vertical Lift Span as it is being raised!
Commissioner of Railway Safety is conducting a detailed review of the functionality of the Vertical Lift Span today at Pamban!#SouthernRailway pic.twitter.com/0WbSYwZswC
— Southern Railway (@GMSRailway) November 14, 2024
ఈ వంతెన ఎలా పైకి లిఫ్ట్ అవుతుందంటే?
రామేశ్వారాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు నిర్మించిన ఈ వంతెన, సరికొత్త టెక్నాలజీ హంగులను అద్దుకుంది. ఈ వంతెన మధ్యలో నుంచి పడవలు, ఓడలు వెళ్లేలా వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని రూపొందించారు. అంటే ఓడలు, పడవలు వెళ్లే సమయంలో ఈ బ్రిడ్జి నిలువుగా పైకి లిఫ్ట్ అవుతుంది. పడవలు, ఓడలు వెళ్లాలక మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది.
ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి
అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ కూడా దాదాపు పూర్తయ్యింది. రీసెంట్ గా ఈ మార్గంలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. ఇప్పటికే, ఈ బ్రిడ్జి మీద ట్రయల్ రన్స్ కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఈ రైల్వే మార్గం కూడా జనవరిలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.
Read Also: మస్క్ మామకు బ్యాడ్ న్యూస్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలును ఆవిష్కరించిన డ్రాగన్ కంట్రీ!