Nitish Kumar Reddy: మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కులం గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనందరికీ {Nitish Kumar Reddy} వ్యక్తిగత స్వేచ్ఛతో జీవించే హక్కును కల్పించింది. కులరహిత సమాజంగా దేశం మారాలని, పౌరుల మధ్య సామాజిక అసమానతలు తొలగిపోవాలనేది రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం. కానీ ఇప్పటికీ ఈ లక్ష్యాలను చేరుకోవడానికి మనం ఎంతో దూరంలో ఉన్నాం.
Also Read: Nitish Kumar Reddy father: గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి
సాంప్రదాయాలకు పుట్టిల్లు లాంటి మనదేశంలో కులం పట్టింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నేళ్లు గడిచినా భారత ప్రజలు కలలు కంటున్నా కులరహిత సమాజం కలగానే మిగిలిపోతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఈ కులం పట్టింపులు మరింత ఎక్కువేనని చెప్పవచ్చు. అయితే తాజాగా వార్తల్లో నిలుస్తున్న ఓ తెలుగు క్రికెటర్ {Nitish Kumar Reddy} కులం గురించి చర్చ రావడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగిన నాలుగో టెస్ట్ లో సెంచరీ తో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని గాజువాక కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే.
191 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టుకి.. 8వ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన ఈ 21 ఏళ్ల కుర్రాడు తన అద్భుత బ్యాటింగ్ తో భారత్ ని ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. నితీష్ కి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం కూడా గమనార్హం. అయితే ఓవైపు సెంచరీ సాధించిన ఈ తెలుగోడిపై {Nitish Kumar Reddy} ప్రశంసల జల్లు కురుస్తుంటే.. మరోవైపు కొందరు అభిమానులు మాత్రం అతని కులంపై చర్చకు తెరలేపారు. ఏళ్లు గడుస్తున్నా మనుషులకు ఈ కుల జాడ్యం వీడడం లేదనే విషయాన్ని మరోసారి నిరూపించారు.
నితీష్ కుమార్ అసలు రెడ్డి కాదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడని సంబరపడిన కొంతమంది నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇక మరికొందరు మాత్రం నితీష్ రెడ్డేనని.. అతని తాత తమకు తెలుసంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నితీష్ మత్స్యకార జాతికి సంబంధించిన “రెడ్డిగ” అనే సామాజిక వర్గానికి చెందిన వాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సామాజిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంబీసీలుగా గుర్తించిందని పేర్కొంటున్నారు.
Also Read: Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా కోనేరు హంపి
కానీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారి పేరు చివర రెడ్డి అనే పేరు ఉంటుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అనవసర విషయంపై సోషల్ మీడియాలో చర్చకు తెరలేపి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం భవిష్యత్తులో అతడిని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన నితీష్ జాతీయ జట్టులో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదని.. ఇకనుంచి నితీష్ చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు.