Roopkund Lake: హిమాలయాల్లో, ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో 5,029 మీటర్ల ఎత్తులో దాగిన రూప్‌కుంద్ సరస్సు, లేదా స్కెలిటన్ లేక్, ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కేవలం 130 అడుగుల వెడల్పున్న ఈ చిన్న సరస్సు చుట్టూ అస్థిపంజరాలు, చెక్క ఆయుధాలు, తోలు చెప్పులు, ఉంగరాలు ఒక రహస్య కథను చెబుతాయి. 1942లో ఫారెస్ట్ రేంజర్ హెచ్.కె. మాధ్వాల్ ఈ సరస్సును కనుగొన్నప్పుడు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, ట్రెక్కర్లు అందరూ ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. కానీ, ఈ సరస్సు ఇంకా తన సీక్రెట్స్‌ను రివీల్ చేయడం లేదు!
అస్థిపంజరాలు
త్రిశూల్ పర్వతం కింద దాగిన ఈ సరస్సు సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవిలో మంచు కరిగినప్పుడు, 500-800 అస్థిపంజరాలు, ఇనుప కత్తులు, చెక్క ఆయుధాలు బయటపడతాయి. ఈ సరస్సుకు చేరాలంటే ఐదు రోజుల కఠినమైన ట్రెక్ తప్పదు. అదే దీని థ్రిల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఈ అస్థిపంజరాలు ఎవరివి? ఎందుకు ఇక్కడికి వచ్చారు? సైనికులా, యాత్రికులా, లేక ఆత్మహత్య చేసుకున్నవాళ్లా? అనే అనేక సందేహాలు ఉన్నాయి. 9వ శతాబ్దంలో భీకరమైన వడగండ్ల తుఫాను వీళ్లను కబళించి ఉండొచ్చని ఒక థియరీ చెబుతోంది.
DNA ట్విస్ట్
2019లో నేచర్ కమ్యూనికేషన్స్‌లో పబ్లిష్ అయిన స్టడీ ఈ మిస్టరీని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చింది. భారత్, జర్మనీ, అమెరికా శాస్త్రవేత్తలు 38 అస్థిపంజరాల DNA, రేడియోకార్బన్ డేటింగ్ చేసి మైండ్-బ్లోయింగ్ ఫాక్ట్స్ బయటపెట్టారు. వీటిలో మూడు డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయట!
గ్రూప్ 1: 23 మంది దక్షిణ ఆసియా వాళ్లు, 7వ-10వ శతాబ్దంలో చనిపోయినవాళ్లు. వీళ్లు నందాదేవి రాజ్ జాత్ యాత్రలో ఉన్న స్థానికులు కావచ్చు.
గ్రూప్ 2: 14 మంది తూర్పు మధ్యధరా నుంచి వచ్చినవాళ్లు, 1800 A.D.లో చనిపోయారు.
గ్రూప్ 3: ఒక ఆగ్నేయ ఆసియా వ్యక్తి.
షాకింగ్ ఫాక్ట్?
ఈ మరణాలు ఒకే టైంలో జరగలేదు. వెయ్యి సంవత్సరాల వ్యవధిలో జరిగాయి! మరి
ఆ అస్తి పంజరాలు ఒకే చోటుకి ఎలా వచ్చాయి? రూప్‌కుంద్‌లో ఏం జరిగిందో ఇప్పటికీ క్లియర్ కాలేదు, కానీ ఇది ఒకే సంఘటన కాదని తెలిసిందని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు చెబుతున్నారు.
డెత్ స్టోరీ ఏంటి?
సరస్సు సూపర్ కోల్డ్ క్లైమేట్ వల్ల శరీరాలు కుళ్లకుండా ఉన్నాయి. సరస్సు లోతు కేవలం 10 అడుగులే, రిడ్జ్ నుంచి రాళ్లు, శిథిలాలు జారడం వల్ల అస్థిపంజరాలు ఇక్కడ చేరాయి. 2004 ఫోరెన్సిక్ స్టడీ ప్రకారం, దక్షిణ ఆసియా అస్థిపంజరాలకు క్రికెట్ బంతులంత పెద్ద వడగండ్ల తుఫాను కారణం కావచ్చు. స్థానిక కథల్లో కన్నౌజ్ రాజు జస్ధవాల్ నేతృత్వంలోని యాత్రికులు నందాదేవి యాత్రలో తుఫానులో చిక్కుకున్నట్లు చెప్పబడింది. కానీ మధ్యధరా వాళ్ల స్టోరీ? టోటల్ బ్లాంక్! 1800లలో గ్రీస్, క్రీట్ నుంచి హిమాలయాలకు ఎవరూ వచ్చినట్లు రికార్డులు లేవు. వీళ్లు అడ్వెంచరర్సా, ట్రేడర్సా, లేక వేరే ఎవరైనా? మరణాలకు హైట్స్ అంటే భయం, చలి, ఆకలి కారణమై ఉండొచ్చని మరికొందరు చెబుతారు.
మిస్టరీ!
రూప్‌కుంద్ సరస్సు అందమైన నేచర్‌తో పాటు ఒక రహస్యమైన హిస్టరీని కలిగి ఉంది. ఇక్కడి అస్థిపంజరాలు వేల సంవత్సరాల చరిత్రను, విభిన్న కల్చర్స్‌ను చూపిస్తున్నాయి. సైంటిఫిక్ స్టడీస్ కొన్ని ఆన్సర్స్ ఇచ్చినా, మరిన్ని క్వశ్చన్స్ తెరతీశాయి. మధ్యధరా ప్రయాణికులు ఎవరు? దక్షిణ ఆసియా యాత్రికులు ఒకే తుఫానులో చనిపోయారా? ఈ డిఫరెంట్ కల్చర్స్‌ను ఈ సరస్సు వద్దకు ఏం తీసుకొచ్చింది? రూప్‌కుంద్ సరస్సు తన సీక్రెట్స్‌ను మంచులో లాక్ చేసి, మరో డిస్కవరీ కోసం వెయిట్ చేస్తోంది.