OTT Movie : బ్రతికి ఉన్నప్పుడు చేయకూడని పనులు చేసి, చచ్చాక పశ్చాత్తాప పడితే ఏమాత్రం ఉపయోగం ఉండదన్న విషయం తెలిసిందే. పైగా ఆత్మలు, దెయ్యాలను నమ్మేవాళ్ళు తమకు ఇష్టమైన వారి చివరి కోరికలు తీర్చడానికి చాలా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ చచ్చిన వాళ్ళు తిరిగిరారు. కానీ అలా కోరికలు తీరని దెయ్యాలంతా వింతగా ఓ అమ్మాయి చుట్టూ పడతాయి. తమ చివరి కోరికను తీర్చమని అడుగుతాయి. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? మూవీ పేరు ఏంటో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
బేక్ డాంగ్-జూ (లీ హైరీ) ఒక ఫ్యూనరల్ డైరెక్టర్. ఆమెకు మరణించిన వారితో మాట్లాడగలిగే సూపర్ పవర్ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పవర్ ఉంటే ఎవరైనా సూపర్ హీరోలా ఫీల్ అవుతారు. కానీ ఈ పవర్ ఆమెకు మాత్రం భారంగా అనిపిస్తుంది. నిజానికి ఆమె మాజీ పింగ్-పాంగ్ ప్లేయర్. కానీ కాలికి గాయం అయిన తర్వాత ఈ జాబ్ మొదలు పెడుతుంది. అయితే ఆమె చేసే పనిని అందరూ చిన్న చూపు చూస్తారు. అందుకే హీరోయిన్ ఈ ఉద్యోగాన్ని వదిలి సివిల్ సర్వీస్ పరీక్ష రాయాలని కోరుకుంటుంది. మరొవైపు ఆమె మరణించిన వారి చివరి కోరికలను నెరవేర్చాలి, లేకపోతే హీరోయిన్ కు దురదృష్టం ఎదురవుతుంది. దెయ్యాలు కోరే ఈ కోరికలు కొన్నిసార్లు కామెడీగా ఉంటాయి.
కిమ్ జిప్-సా (లీ జున్-యంగ్), అలియాస్ తే-హీ, ‘ఎ డైమ్ ఎ జాబ్’ (Ildangbaek) అనే ఎర్రాండ్ సర్వీస్ లో పని చేస్తాడు. దాన్ని అతని మామ విన్సెంట్ (లీ క్యూ-హాన్) నడుపుతాడు. ఈ సర్వీస్ చిన్న చిన్న పనుల నుండి పెద్ద పనుల వరకు అన్నీ చేస్తుంది. డాంగ్-జూ బాయ్‌ఫ్రెండ్ ఆమెతో బ్రేకప్ చెప్పడానికి జిప్-సాను నియమిస్తాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ తరచుగా కలుస్తూ ఉండడంతో ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక ఇద్దరూ కలిసి చనిపోయిన వారి కోరికలను నెరవేర్చడానికి ట్రై చేస్తారు.
కథలో డాంగ్-జూ, తే-హీ పర్సనల్ లైఫ్, గతంలో తగిలిన గాయాలకు సంబంధించిన సీన్స్ కీలకంగా ఉంటాయి. తే-హీ ఒక డాక్టర్. కానీ తన చిన్న తమ్ముడు జూన్-హో మరణం తర్వాత వైద్య వృత్తిని వదిలేస్తాడు. ఒక కారు యాక్సిడెంట్ కారణంగా జరిగిన ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన సీన్స్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. తరువాత డాంగ్-జూ తనకు ఈ శక్తి ఎలా వచ్చిందో కనిపెడుతుంది. ఇంతకీ హీరోయిన్ కి ఈ పవర్ ఎలా వచ్చింది? దాన్ని ఆమె ఎలా వాడుకుంది? హీరో బ్రదర్ కు విషయంలో వచ్చే ట్విస్ట్ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే.
స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే…
ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఓ క్రేజీ కొరియన్ సిరీస్. ఈ సిరీస్ పేరు ‘మే ఐ హెల్ప్ యూ?’ (May I Help You). 2022లో విడుదలైన ఈ దక్షిణ కొరియన్ సిరీస్ లో ఫ్యాంటసీ, థ్రిల్లర్, ఎమోషన్స్, కామెడీ వంటి అంశాలన్నీ కలగలిపి ఉంటాయి. ఈ సిరీస్‌లో లీ హైరీ (Baek Dong-ju), లీ జున్-యంగ్ (Kim Tae-hee) ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 16 ఎపిసోడ్‌లతో సాగే ఈ సిరీస్ 2022లో రిలీజ్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్ సుమారు 70 నిమిషాలు ఉంటుంది. ఇండియాలో Amazon Prime Video లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.