Mass Jathara : ముందుగా చిన్న చిన్న సినిమాల్లో నటుడుగా కనిపించిన రవితేజ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నాడు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న తరుణంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ నిన్ను పెద్ద హీరోని చేస్తాను అని అంటూ ఉండేవారు. అయితే ఆ మాటలు రవితేజ ఏ రోజూ నమ్మలేదు. మొత్తానికి రవితేజ కూడా ఊహించని హిట్ సినిమాలను పూరి జగన్నాద్ రవితేజ కెరీర్ కి అందించాడు. రవితేజ చేసిన బెస్ట్ సినిమాల గురించి ప్రస్తావన వస్తే దాంట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలు ఖచ్చితంగా వినిపిస్తాయి.
మాస్ జాతర అప్డేట్
రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో అవి ఫెయిల్ అవుతూ వచ్చాయి. కానీ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత చేసిన రవితేజ సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. అందరూ హీరోలా కాకుండా రవితేజ హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈనెల ఆఖరిలోపు పూర్తకబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు రవితేజ.
కిషోర్ తిరుమల సినిమా అప్డేట్
దర్శకుడు కిషోర్ తిరుమల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా చేసిన నేను శైలజ సినిమా దర్శకుడుగా కిషోర్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత చేసిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఒక సాయి తేజ్ కెరియర్లో వచ్చిన చిత్రాలహరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా కూడా కిషోర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే రామ్ హీరోగా చేసిన రెడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు రవితేజ హీరోగా చేయబోయే సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జూన్ రెండవ వారం నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Hari Hara Veeramallu : పవన్ మూవీని అడ్డుకుంటున్న ఆ నలుగురు నిర్మాతలు… అందుకే ఈ పర్సంటేజ్ డ్రామా..?