Uttarakhand Tourism: ఎటు చూసినా మంచు కొండలు, కనువిందు చేసే పచ్చటి వనాలు. ఆహా అనిపించే అద్భుతమైన లోయలు. అక్కడ అడుగు పెడితేనే తెలియకుండానే ఆధ్యాత్మిక భావన ఆవహిస్తుంది. స్వర్గంలో విహరిస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అదే ఉత్తరాఖండ్. జీవితంలో ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన రాష్ట్రం ఇది. ఇక్కడ తప్పకుండా విజిట్ చేయాల్సిన పర్యాటక ప్రాంతాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
డోంట్ మిస్ ‘చార్ ధామ్’
ఉత్తరాఖండ్ లో అస్సలు మిస్ కాకూడని ప్రాంతాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రినాథ్. ఈ నాలుగు ప్రాంతాలను కలిపి చార్ ధామ్ అని పిలుస్తుంటారు. వీటిలో కేదార్ నాథ్, యమునోత్రికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లి దర్శించుకోవాల్సి ఉంటుంది. బద్రినాథ్, గంగోత్రికి రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. సొంత వాహనాల్లో అక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి హరిద్వార్ లో 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఉత్తరాఖండ్ లో కొన్ని అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలతో పాటు ఇండియాలోనే బెస్ట్ రివర్ ర్యాఫ్టింగ్ ఉంటుంది. హయ్యెస్ట్ బంగీ జంప్ అనుభవాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది.
కనువిందు చేసే ‘వ్యాలీ ఆఫ్ ప్లవర్స్’
ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. వాటిలో ఒకటి ‘వ్యాలీ ఆఫ్ ప్లవర్స్’. రుతుపవనాల సమయంలో ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటుంది. రంగు రంగుల పూలను చూసి మైమరిచిపోక తప్పదు. అంతేకాదు, ఇక్కడ ఎంతో అందమైన హిల్ స్టేషన్స్ ఉంటాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్ పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉండే అటవీ జంతువులు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి.
Read Also: సరస్వతీ పుష్కరాలకు వెళ్తున్నారా? ఇలా ప్లాన్ చెయ్యండి!
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోప్ వే
ఇక ఉత్తరాఖండ్ లో చెప్పుకోవాల్సిన మరో అద్భుతం రోప్ వే. సుమారు 4 కిలో మీటర్ల పొడవులో ఈ రోప్ వే ఉంటుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద రోప్ వే కాగా, ప్రపంచంలో రెండో అతి పెద్ రోప్ వేగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలో అతి పెద్ద రోప్ వే వియత్నాంలో ఉంది. దీని పొడవు సుమారు 8 కిలో మీటర్లు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సమ్మర్ లో నార్త్ టూర్ ప్లాన్ చేసినట్లు అయితే, కచ్చితంగా ఉత్తరాఖండ్ ను పరిగణలోకి తీసుకోండి. ఈ రాష్ట్రానికి వెళ్తే అద్భుతమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు అద్భుతమైన ప్రకృతి అందాలను చూసి ఆనందించే అవకాశం ఉంటుంది.
Read Also: ఆకాశంలో అద్భుత నిర్మాణం, చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!