Ruyi Bridge In China: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింతలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చైనాలోనే ఉన్నాయి. ఇంతకీ ఈ మాట ఎందుకు అంటున్నామంటే.. వాళ్ల ఆలోచన విధానం నిజంగా వావ్ అనిపించేలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా బోలెడు వింతైన వంతెనల గురించి తెలుసు. గత కొంత కాలంగా గాజు వంతెనలు ఆయా దేశాల్లో టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇండియాలోనూ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గాజు వంతెనలు ఉన్నాయి. అయితే, చైనాలో ఉన్న గాజు వంతెనను చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. అసలు ఈ వంతెన కట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా బాబోయ్ అనుకోవాల్సిందే. ఇంతకీ, ఆ వంతెన ఎక్కడుంది? ఎప్పుడు నిర్మించారు? దాని ప్రత్యేకత ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
షెంజియాంజ్ లో అద్భుత నిర్మాణం రుయి వంతెన
చైనాలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటికి అదనపు హంగులు అద్దుతూ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అందులో భాగంగానే ‘రుయి బ్రిడ్జి’ని నిర్మించింది. జెజియాంగ్ ఫ్రావిన్స్ లోని షెంజియాంజ్ దగ్గర దీనిని నిర్మించారు. చుట్టూ అందమైన లోయలు, కొండల నడుమ అద్భుతమైన గాజు వంతెనను నిర్మించింది. ఈ వంతెన రెండు కొండలను కలుపుతూ ఉంటుంది. ఈ వంతెనను దూరం నుంచి చూస్తే, మూడు వంతెనలు అలల మాదిరిగా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే గాలిలో తేలియాడే అద్భుతం అంటారు మరికొంత మంది. ఆకాశానికి, భూమికి మధ్యతో ఓ అద్భుత దృశ్యంగా ఆవిష్కృతం అయ్యింది రుయి వంతెన.
మూడు వంతెనలు మెలి తిరిగినట్లుగా..
చైనాలోనే అద్భుతమైన ఈ వంతెనను హీ యున్ చాంగ్ అనే ప్రముఖ ఇంజినీర్ రూపొందించారు. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ఈ వంతెన పనులను చూసుకున్నారు. ఈ వంతెన మొత్తంగా మూడు వంతెనలు మెలితిరిగి ఉన్నట్లుగా నిర్మించారు. మొత్తం మూడు దారులు ఉంటాయి. ఈజీగా ఈ వంతెనలపై నడిచేలా ఏర్పాట్లు చేశారు. ఈ వంతెనలు అన్నీ ఒకచోట కలిసేలా చేశారు. నిజంగా ఇదో ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైన గాజు వంతెనకు రూపకర్త ‘హీ యున్‌చాంగ్’ అనే ఓ ప్రఖ్యాత ఇంజినీర్. ఈ వంతెనను ఓ చోట మూడు దారులుగా విభజించారు. ఈ వంతెన మీద నిలబడి ఆకాశంలోని మేఘాలకు హాయ్ చెప్పినట్లుగా ఉంటుంది.
Ruyi Bridge in Zhejiang, China: A Stunning Architectural Wonder in the Sky pic.twitter.com/aCXUu1ckuf
— non aesthetic things (@PicturesFoIder) May 14, 2025
నిత్యం వేలాది మంది పర్యాటకుల సందర్శన
రుయి వంతెనను కేవలం మూడు ఏళ్లలో నిర్మించారు. 2017లో ఈ వంతెన నిర్మాణ పనులు మొదలు కాగా, 2020లో పూర్తి అయ్యింది. ఈ వంతెనను ప్రారంభించిన తొలి రోజు నుంచే పర్యాటకులను అనుమతించారు. తక్కువ సమయంలో ఈ వంతెన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నెల రోజుల్లో ఏకంగా 2 లక్షల మంది ఈ గాజు వంతెనను సందర్శించారు. మొత్తం 100 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన, ఏకంగా 140 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చైనీయులు ఈ వంతెనను బెండింగ్ బ్రిడ్జిగా పిలుస్తుంటారు. మూడు వంతెనలు మెలి తిరిగినట్లుగా ఉండటంతో దీనిని అలా పిలుస్తారు. ఈ వంతెన నిర్మాణం తర్వాత ఆ ప్రాంతం అంతా పర్యాటకులతో కళకళలాడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది.
Read Also: ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న ఏకైక రాష్ట్రం, అక్కడికి వెళ్లాలంటే అంత ఈజీ కాదు!