Watch : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా ఎప్పుడూ క్యాచ్ ఔట్ అవుతారో.. ఎప్పుడూ సిక్స్ లు, ఫోర్లు కొడతారో.. ఎప్పుడూ వికెట్లు తీస్తారో ఊహించడం చాలా కష్టం అనే చెప్పవచ్చు. వరుస బంతుల్లో సిక్స్ లు కొడుతున్న సమయంలోనే అకస్మాత్తుగా ఔట్ అవుతుంటారు. మరికొన్ని సార్లు వరుసగా వికెట్లు పోతున్న సమయంలో సిక్స్ లు, ఫోర్లు కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తుంటారు. ఇలా క్రికెట్ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అతని చేతిలోంచి బంతి జారీ బౌండరీ లైన్ అవుతల పడబోయింది.
Also Read : Shikhar Dhawan : ప్రియురాలితో శిఖర్ ధావన్ ఘాట్ రొ**మాన్స్.. జిమ్ లోనే మొదలెట్టారు
అయితే బౌండరీ లైన్ అవుతల బంతి కింద పడకుండా మూడు సార్లు బౌండరీ నుంచి క్యాచ్ పట్టుకుంటూ ఇవతలికి తీసుకొచ్చాడు. కరెక్ట్ బౌండరీ లైన్ ఇవతల గ్రౌండ్ లో క్యాచ్ పట్టాడు. ఫీల్డర్ ఇది ఔటేనా..? కాదా..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏ మ్యాచ్ లో మాత్రం తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతోంది. ఇక మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని పరిశీలించినట్టయితే ఈ సీజన్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సారి టైటిల్ సాధిస్తుందని.. ఏఐ టెక్నాలజీతో ఓ వీడియో ని ఇటీవలే క్రియేట్ చేశారు. సోసల్ మీడియాలో అది వైరల్ అయింది.
మరోవైపు ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు.. తొలి స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ జట్టు రెండో స్థానంలో, పంజాబ్ కింగ్స్ జట్టు మూడో స్థానంలో.. ముంబై ఇండియన్స్ జట్టు టాప్ 4లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి. అయితే పంజాబ్ ఇంకా 3 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ మిగిలిన మ్యాచ్ ల విజయాలను బట్టి ప్లే ఆప్స్ అవకాశాలు ఎవరు టాప్, ఎవరు ఎలిమినేటర్ అనేది తెలియనుంది. అయితే ఇప్పటికే గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆప్స్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. మిగిలిన పంజాబ్, ముంబయి, ఢిల్లీ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జట్ల కి సంబంధించి ముంబై ఢిల్లీ, పంజాబ్ తోనే తలపడనుంది. ఆ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తేనే.. ముంబై కి ఛాన్స్ ఉంటుంది. అయితే ముంబై కి రన్ రేట్ పాజిటివ్ గా ఉండటం కలిసొచ్చే అంశం. మరి ఈ సీజన్ లో టైటిల్ ఏ జట్టు కొడుతుందో చూడాలి మరీ.
OUT or NOT OUT 🤔 pic.twitter.com/quFUm1GbHW
— Richard Kettleborough (@RichKettle07) May 14, 2025