Delhi Tour: మన దేశ రాజధాని అయిన ఢిల్లీ చాలా అందమైన నగరం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో అనేక టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయి. కొన్ని సార్లు సమయం ఎక్కువగా లేనప్పుడు 24 గంటల్లోనే ఢిల్లీ చూడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లోధి గార్డెన్:
లోధి గార్డెన్ ఉదయం పూట చూడటానికి చాలా బాగుంటుంది. ఇది ఒక గార్డెన్. ఇక్కడ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఢిల్లీలో అత్యంత పరిశుభ్రమైన, అందమైన తోట. ప్రముఖులు, అధికారులు, రాజకీయ నాయకులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ఉదయం 7 – 8 గంటల మధ్య ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది.
జామా మసీదు:
తర్వాత టిఫిన్ చేసి జామా మసీదుకి వెళ్ళండి. ఈ ప్రదేశానికి గొప్ప చారిత్రక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా..వివిధ రకాల కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ఉదయం పూట ఇక్కడ జనం తక్కువగా ఉంటారు. వాతావరణం కూడా పగటిపూట కంటే చల్లగా ఉంటుంది. ఈ ప్రదేశం నాన్ వెజ్ వంటకాలు చాలా ఫేమస్.
ఎర్రకోట:
మీరు ఢిల్లీకి వస్తే.. తప్పకుండా ఎర్రకోటను చూడండి. దీని అందమైన ఎరుపు రంగు గోడలు లేదా లోపల నిర్మించిన మ్యూజియం అయినా మీరు ఇష్టపడతారు. దీనికోసం కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు కేవలం 15 రూపాయల టికెట్‌తో ఈ కోటను చూడొచ్చు.
కన్నాట్ ప్లేస్:
కన్నాట్ ప్లేస్ షాపింగ్ మాత్రమే కాదు.. చుట్టూ తిరగడానికి, సరదాగా గడపడానికి కూడా ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడి చిన్న చిన్న దూకాణాల్లో ఢిల్లీ స్పెషల్ వంటకాలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అంతే కాకుండా షాంపింగ్ లవర్స్‌కు కూడా ఈ ప్రదేశం నచ్చుతుంది.
ఢిల్లీ హాత్:
ఢిల్లీ హాత్ అనేది మీరు మొత్తం దేశం యొక్క సంస్కృతిని చూసే ప్రదేశం. ఇక్కడ చేతితో తయారు చేసిన వస్తువుల యొక్క అనేక స్టాళ్లు ఉంటాయి.
ఇండియా గేట్ చరిత్ర:
ఇండియా గేట్ ఒక విధంగా భారతదేశం యొక్క గుర్తింపు అని చెప్పాలి. ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం, ఇక్కడ అమరవీరుల పేర్లు కూడా లిఖించబడి ఉంటాయి. ఇది 1931 లో నిర్మించబడిన యుద్ధ స్మారక చిహ్నం. దీని ఎత్తు 43 మీటర్లు ఉంటుంది. ఇండియా గేట్ చూడటానికి కూడా పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తారు.
Also Read: దేశంలోని అందమైన జలపాతాలు ఇవే, ఎక్కడున్నాయంటే ?
స్ట్రీట్ ఫుడ్:
ఢిల్లీ వీధుల్లో ఆహారం కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. ఇక్కడ స్నాక్స్ రుచి చూడకుండా తిరిగి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి వివిధ రకాల ఢిల్లీ స్పెషల్ ఫుడ్ ఇక్కడ తినడం మర్చిపోవద్దు.