Miss World Contestants: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. మే 10న గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ అందాల పోటీల కోలాహలం మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయ్యాయి. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో మిస్ వరల్డ్ పోటీలు మొదలయ్యాయి. గుస్సాడీ, కొమ్ము కోయ కళాకారులు ప్రదర్శన విదేశీ అతిధులను ప్రత్యకంగా ఆకర్షించింది.
పోటీల్లో భాగంగా మొదటి రోజు అందాల భామల ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు.. తమ దేశ సంప్రదాయ దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. మొదటి రౌండ్‌లో కరేబియన్, లాటిన్ అమెరికా, రెండో రౌండ్‌లో ఆఫ్రికా ఖండం, మూడో రౌండ్‌లో యూరప్ ఖండం కంటెస్టెంట్లు, నాలుగో రౌండ్‌లో ఆసియా ఓషియానియా కంటెస్టెంట్లు ర్యాంప్ పైకి వచ్చారు. అందరికంటే చివరగా ర్యాంప్ పైకి వచ్చిన మిస్ వియత్నాం తనదైన డాన్స్‌తో ఆకట్టుకుంది. మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినప్పుడు స్టేడియం మార్మోగింది. చీర కట్టుతో ర్యాంపు పైకి వచ్చిన మిస్ నేపాలీ అందరి దృష్టిని ఆకర్షించింది.
దాదాపు 20 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలు జరుగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా అందగత్తెలు పోటీలో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోని వివిధ చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలను సందర్శించనున్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మే 31న హైదరాబాద్లోని హైటెక్స్ సెంటర్లో జరగనుంది.
ఈ పోటీలతో తెలంగాణ బ్రాండ ఇమేజ్ మరొక్కసారి ప్రపంచ దేశాలకు తెలుస్తుందన్నారు సీఎం. ప్రారంభ వేడుకలో మిస్ఇండియా నందిత గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యూట్ లహంగాతో మెరిసింది. ఆమె ర్యాంప్ మీద నడుస్తుంటే స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది.మిస్ వరల్డ్ పోటీదారులు రకరకాల కాస్ట్యూమ్స్ర్‌తో ఆకట్టుకున్నారు. సంగీతానికి తగ్గట్టుగా నృత్యాలతో అందరిని అలరించారు.
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొన్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది కంటెస్టెంట్స్ బృందం.. నల్గొండ జిల్లా బుద్ధ వనాన్ని సందర్శించింది. ప్రపంచ సుందరీమణులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యమిచ్చింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయ విహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికింది.
Also Read: చౌమహల్లా ప్యాలెస్‌లో.. ప్రపంచ అందగత్తెలు విందు
నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ బృందం. విజయవిహార్ సందర్శన తర్వాత.. సాగర తీరంలో ఫొటో షూట్ జరిగింది. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి.. మహా స్థూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. మహాస్థూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు.. లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు.. జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం జాతకవనంలో బుద్ధ చరితం పై కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు.