BigTV English

Alia Bhatt: ‘ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని తల్లి ఉంది’.. సుదీర్ఘ పోస్ట్ పంచుకున్న ఆలియా..!

Alia Bhatt: ‘ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని తల్లి ఉంది’.. సుదీర్ఘ పోస్ట్ పంచుకున్న ఆలియా..!

Alia Bhatt:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt)దేశ సరిహద్దుల్లో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని.. దేశం కోసం పోరాడుతున్న సైనికులను , ఆ సైనికులను దేశానికి అందించిన వారి తల్లులను దృష్టిలో పెట్టుకొని ఒక సుదీర్ఘ పోస్టు పంచుకున్నారు. మదర్స్ డే సందర్భంగా ఆమె షేర్ చేసిన ఈ సుదీర్ఘ పోస్ట్ అందరిలో ఆలోచనలు కలిగిస్తోంది. దేశాన్ని కాపాడుతున్న ప్రతి యూనిఫాం వెనుక ఒక నిద్రపోని తల్లి ఉంది అంటూ తన మనసులోని భావాలను పంచుకుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. అలియా భట్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆ పోస్టులో ఏముంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాను – అలియా భట్..

అలియా భట్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా వేదికగా.. భారతదేశం – పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తలుచుకొని దేశం సరిహద్దుల్లో దేశానికి అండగా నిలిచిన ధైర్యవంతులైన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన భావాలను పంచుకుంది. అంతేకాదు ఈ మాతృ దినోత్సవం సందర్భంగా దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జవాన్ల తల్లులకు కృతజ్ఞతలు తెలియజేసింది. వారికి ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. ఇక తన నోట్లో అలియా భట్..” గత కొన్ని రాత్రులు చాలా భిన్నంగా అనిపించాయి. దేశం ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలిలో ఏర్పడిన నిర్దిష్ట నిశ్శబ్దాన్ని నేను విన్నాను. గత కొన్ని రోజులుగా ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాను కూడా.. ఆ నిశ్శబ్దం కలిగించే ఆందోళన.. ప్రతి సంభాషణ వింటుంటే హార్ట్ రేటు పెరిగిపోయింది. ఎక్కడో పర్వతాలలో మన సైనికులు అప్రమత్తంగా మేల్కొని, తాము ప్రమాదంలో ఉన్నామని తెలిసి కూడా ఆ భారాన్ని మోస్తూ.. దేశం కోసం పాటుపడ్డారు. ఇక వారు పడ్డ ఆ కష్టాన్ని నేను కూడా అనుభవించాను. మనలో చాలామంది ఈ ఉద్రిక్తతల వేళ బయటికి వెళ్లలేక ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు. అటు చీకటిలో నిలబడి ఉన్న పురుషులు, మహిళలు తమ జీవితాలతో తమ నిద్రను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మీరు చేస్తున్నది ధైర్యం కాదు ఒక త్యాగం” అంటూ ఆర్మీ జవాన్లపై ప్రశంసలు కురిపించింది ఆలియా భట్.


ప్రతి యూనిఫాం వెనుక ఒక నిద్రపోని తల్లి ఉంది – అలియా భట్

అలాగే ఆర్మీ జవాన్ల తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. “ప్రతి యూనిఫాం వెనుక ఒక తల్లి నిద్రలేని రాత్రులు అనుభవిస్తోంది. తన బిడ్డ సుఖాన్ని కాదు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు అని తెలిసి కూడా గుండె ధైర్యంతో ముందుకు సాగుతోంది. తన బిడ్డ లాలి పాటలతో కాకుండా అనిశ్చితితో కూడిన రాత్రిని ఎదుర్కొంటున్నాడని తెలిసిన ఆ తల్లి ఉద్రిక్తత క్షణంలో చెదిరిపోయే నిశ్శబ్దాన్ని అనుభవిస్తూ బిడ్డల క్షేమానికై ఎదురుచూస్తోంది. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలామంది పూలమాలలు, హృదయపూర్వక ఆలింగణాలతో జరుపుకుంటున్నప్పటికీ. నా ఆలోచనలు మాత్రం మన దేశాన్ని కాపాడుతున్న హీరోలను పెంచిన తల్లులు.. నిశ్శబ్ద గర్వం, అచంచలమైన స్థితిస్థాపకత కలిగి ఉన్న తల్లులు నాకు గుర్తుకు వచ్చారు. ఎప్పటికీ ఇంటికి రాని అమరవీరులైన సైనికులను కూడా దేశం ఎప్పటికీ మర్చిపోదు. దేశం ఆత్మలో శాశ్వతంగా వారి పేర్లు చెక్కబడి ఉంటాయి. ముఖ్యంగా దేశం కోసం హీరోలను పెంచి, ఆ నిశ్శబ్ద గర్వాన్ని తమ వెన్నెముకలో మోసిన తల్లుల గురించి నేను ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ఆలోచించ లేకుండా పోయాను. కోల్పోయిన ప్రాణాలకు, ఎప్పటికీ ఇంటికి రాని సైనికులను తలుచుకొని మరింత దుఃఖిస్తున్నాను. దేశం కోసం హీరోలను తయారుచేసిన అలాంటి తల్లులు అందరికీ కూడా ఈ మదర్స్ డే సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అంటూ తెలిపింది అలియా భట్.

ALSO READ:Balakrishna: దర్శకుడికి బాలయ్య సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..?

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×