BigTV English

Hyderabad Tour: ఒక్క రోజులో హైదరాబాద్ ట్రిప్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు !

Hyderabad Tour: ఒక్క రోజులో హైదరాబాద్ ట్రిప్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు !

Hyderabad Tour: హైదరాబాద్ ఎంతో చరిత్ర కలిగిన నగరం. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడినుండో వచ్చిన ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఫలితంగా వివిధ రకాల జీవన విధానం, సాంప్రదాయాలు కలిగిన ప్రజలను మనం ఈ ఒక్క నగరంలోనే చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీకి కూడా చాలా ఫేమస్. ఇక్కడ నిజాం నవాబుల పాలనలో నిర్మించిన ఎన్నో భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా ఎన్నో పర్యాటక ప్రదేశాలు కూడా నగరంలో ఉన్నాయి. కానీ హైదరాబాద్ చూడటానికి ఒక్క రోజు మాత్రం అస్సలు సరిపోదు. టైం లేనప్పుడు హైదరాబాద్‌లోని కొన్ని ప్రదేశాలు మాత్రమే చూడాల్సి వస్తే.. మీ టూర్ అసంపూర్ణంగా అనిపించకుండా ఈ ప్రత్యేక ప్రదేశాలను చూడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


రామోజీ ఫిల్మ్ సిటీ:
రామోజీ ఫిల్మ్ సిటీ నిజంగా చాలా పెద్దది. దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదు చేయబడింది. 1996లో సినీ నిర్మాత రామోజీ రావు దీనిని నిర్మించారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతాయి. సినిమాల్లో మీరు ఇక్కడ ఉండే చాలా భాగాలను చూసి ఉండొచ్చు ఈ ఫిల్మ్ సిటీని ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య 1.5 మిలియన్లకు పై మాటే. దీనిని మీరు ఒక్క సారి చూస్తే ఎప్పటికీ మరచిపోలేరు.

గోల్కొండ కోట:
ఈ కోటను 14వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ.. దీనిని ఔరంగజేబు 1687 ADలో జయించాడు. ఈ కోట ఒక గ్రానైట్ కొండపై నిర్మించబడింది. దీని చుట్టూ 3 మైళ్ల పొడవైన గోడ అంతే కాకుడా 8 ద్వారాలు కూడా ఉన్నాయి. ఈ కోటకు దక్షిణంగా మూసీ నది కూడా ప్రవహిస్తుంది. ప్రసిద్ధ కోహినూర్ వజ్రం కూడా ఈ భూమిలోనే దొరికిందని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందిన ఇలాంటి అనేక వజ్రాలు కూడా ఇక్కడ లభించాయని చెబుతారు. ఇది మాత్రమే కాదు.. కోట లోపల ఒక మసీదు , అనేక రాజ మందిరాలు ఉన్నాయి.కోట నిర్మించిన విధానం మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది.


సాలార్ జంగ్ మ్యూజియం:
దేశంలోని మూడు జాతీయ మ్యూజియంలలో ఒకటైన సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్‌లోని దార్-ఉల్-షిఫాలో ఉంది. మూసీ నది దక్షిణ ఒడ్డున నిర్మించబడిన ఈ మ్యూజియం నిజానికి సాలార్ జంగ్ కుటుంబం యొక్క వ్యక్తిగత సేకరణ. ఇక్కడ మన దేశానికి చెందినవిీ మాత్రమే కాకుండా జపాన్, నేపాల్, పర్షియా, ఈజిప్ట్, ఉత్తర అమెరికా, బర్మా, చైనా వంటి దేశాల నుండి కూడా అనేక ఇతర వస్తువులతో పాటు కళాఖండాలు, శిల్పాలు, వస్త్రాలు, రాతప్రతులు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటి కూడా.

హుస్సేన్ సాగర్ :
లుంబినీ పార్క్ నగరం నడిబొడ్డున ఉంటుంది. నెక్లెస్ రోడ్ , బిర్లా మందిర్ వంటి ఇతర ప్రదేశాలకు దగ్గరగా ఉండటం వల్ల కూడా ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ పార్క్ హుస్సేన్ సాగర్ సరస్సు దగ్గర నిర్మించబడింది. ఇక్కడి మరో ప్రత్యేకత నీటి మధ్యలో నిర్మించిన బుద్ధుని విగ్రహం. పడవ ప్రయాణం చేస్తూ.. నీటి మధ్యలో ఉన్న బుద్దుడి దగ్గరికి వెళ్తారు. ఈ పార్కును 1994 లో నిర్మించారు.

Also Read: బెంగళూర్ టూర్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

స్నో వరల్డ్:
స్నో వరల్డ్ హైదరాబాద్ లోని మరో బెస్ట్ ప్లేస్. 2 ఎకరాల్లో నిర్మించబడిన ఈ పార్క్ పిల్లలను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. 2004 లో దీనిని ప్రారంభించారు. ఇది హుస్సేన్ సాగర్ కు దగ్గరలోనే ఉంటుంది. దాదాపు 20 టన్నుల కృత్రిమ మంచుతో తయారు చేయబడిన స్నో వరల్డ్‌లో మీరు నిజంగా మంచు పర్వతాలకు వచ్చినట్లు అనిపిస్తుంది.

ఎన్టీఆర్ గార్డెన్:
ఏపీ సీఎ ఎన్టీ రామారావు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. 36 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ ను 2002 లో నిర్మించారు. 150 జాతుల మొక్కలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు.ఫ్యామిలీతో వస్తే.. పిల్లల సరదా ఆడుకోవచ్చు. ఇక్కడ మీరు మినీ రైలును కూడా ఎంజాయ్ చేయొచ్చు.

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×