రివ్యూ : టెన్ అవర్స్ మూవీ
దర్శకత్వం : ఇళయరాజా కలియపెరుమాళ్
నటీనటులు : సిబిరాజ్, గజరాజ్, దిలీపన్, జీవా రవి, సరవణ సుబ్బయ్య, రాజ్ అయ్యప్ప తదితరులు
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
Ten Hours Review : తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘టెన్ అవర్స్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇళయరాజా కలియపెరుమాళ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సిబిరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. గజరాజ్, దిలీపన్, జీవా రవి, శరవణ సుబ్బయ్య, రాజ్ అయ్యప్ప లాంటి నటులు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కాగా, మే 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ తమిళ క్రైమ్ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
టెన్ అవర్స్ మూవీ స్టోరీ మొత్తం ఒకే నైట్ లో జరుగుతుంది. రాత్రి పూట ఒక బస్సులో జరిగే మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈ మూవీ. ఇన్‌స్పెక్టర్ కాస్ట్రో (సిబిరాజ్) ఈ కేసును విచారిస్తాడు. ఒక యువతి కిడ్నాప్ కేసుతో పాటు చెన్నై-కోయంబత్తూర్ ఓవర్‌నైట్ బస్సులో జరిగిన మర్డర్ కేసును పరిష్కరించడానికి అతని దగ్గర ఉండే టైమ్ కేవలం 10 గంటలు. అయితే ఈ రెండు కేసులకు ఒకదానితో ఒకటి లింకు ఉందని హీరో అనుమానిస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి కిడ్నాప్ కేసు ఏంటి? బస్సులో జరిగిన మర్డర్ కేసుకు, దానికి ఉన్న లింక్ ఏంటి? హీరో కేవలం పది గంటల్లో ఈ రెండు కేసులను ఎలా సాల్వ్ చేశాడు? అన్నది స్టోరీ.
విశ్లేషణ
దర్శకుడు ఇళయరాజా కలియపెరుమాళ్ స్క్రీన్‌ప్లే, ముఖ్యంగా సెకండాఫ్ లో చిత్రాన్ని ఉత్కంఠభరితంగా నడిపిస్తుంది. 1 గంట 58 నిమిషాల తక్కువ రన్‌టైమ్ ఉండడం అన్నది ఈ మూవీ ప్లస్ పాయింట్స్. ల్యాగ్ లేకుండా కథను నడిపించారు. కానీ సినిమా ఎక్కువ సమయం ఫ్లాష్‌బ్యాక్‌లు, ఇంటరాగేషన్ సన్నివేశాలతో నడవడం, అందులోని కొన్ని సీన్లను ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దినట్టు అన్పిస్తుంది. ఏదేమైనా సెకండాఫ్ గ్రిప్పింగ్ గా ఉంది.
సిబిరాజ్ ఇన్‌స్పెక్టర్ కాస్ట్రోగా చక్కటి నటన కనబరిచాడు. అతను సూపర్ కాప్‌గా కాకుండా… తప్పులు చేస్తూనే, కష్టపడి కేసును పరిష్కరించే పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. కానీ సినిమాలో మిగతా పాత్రలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. సిబిరాజ్ తప్ప, ఇతర పాత్రలు (ముఖ్యంగా సస్పెక్ట్‌లు) గుర్తుండిపోయే స్థాయిలో లేవు. వారి మోటివ్ కూడా స్ట్రాంగ్ గా అన్పించదు. విలన్ రివీల్, క్రైమ్ మోటివ్ ప్రేక్షకులపై ఆశించిన ఎఫెక్ట్‌ను చూపలేదు. అంతేకాదు క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ గా ఉండడం అనేది థ్రిల్లర్ మూవీ లవర్స్ ను నిరాశపరిచే అంశం. జై కార్తిక్ సినిమాటోగ్రఫీ బస్సు, హైవే సన్నివేశాలను విజువల్‌గా ఆకర్షణీయంగా చిత్రీకరించింది. రాత్రి వాతావరణాన్ని బాగా క్రియేట్ చేశారు. కెఎస్ సుందరమూర్తి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ స్మూత్‌గా ఉంది. నిర్మాణ విలువలు పర్లేదు.
పాజిటివ్ పాయింట్స్
స్క్రీన్‌ప్లే
సిబిరాజ్ నటన
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్
ఎడిటింగ్
నెగెటివ్ పాయింట్స్
సపోర్టింగ్ క్యారెక్టర్లు
ప్రిడిక్టబుల్ క్లైమాక్స్
చివరగా
అంచనాలు లేకుండా ఓసారి చూడగలిగే క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ. ముఖ్యంగా సెకండాఫ్ కోసం.
Ten Hours Review : 1.5/5