Indian Railways: మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లాలని ఉంటుంది. కొత్త దేశాల్లో పర్యటక ప్రాంతాలను, ప్రసిద్ధ నగరాలను చూడాలని ఉంటుంది. కానీ, విదేశీ ప్రయాణం అంటే మాటలా? చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని భయపడుతారు. కానీ, భారత సరిహద్దు దేశాలకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆయా దేశాల సరిహద్దుల వరకు రైల్లో వెళ్లి.. అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేస్తే ఇతర దేశాలకు వెళ్లొచ్చు. ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూసి రావచ్చు. ఇంతకీ సరిహద్దుల్లో ఉన్న రైల్వే స్టేషన్లు ఏవి? రైలు ప్రయాణం ద్వారా సులభంగా వెళ్లే దేశాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
సరిహద్దుల్లో ఉన్న రైల్వే స్టేషన్లు
⦿ హల్దిబారి రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ బెంగాల్ లోని కూచ్ బెహార్ జిల్లాలో ఉంది. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ కేవలం 4 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ మీరు బంగ్లాదేశ్ కు వెళ్లాలని ఉంటే, ఈ రైల్వే స్టేషన్ లో దిగి వెళ్లిపోవచ్చు.
⦿ జయ్ నగర్ రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ నేపాల్ కు సమీపంలో ఉంటుంది. జైనగర్ రైల్వే స్టేషన్ బీహార్ లోని మధుబని జిల్లాలో ఉంటుంది. నేపాల్ కు వెళ్లాలి అనుకునే ప్రయాణీకులు ఈ రైల్వే స్టేషన్ కు చేరుకుంటే సరిపోతుంది. జైనగర్- జనక్ పూర్- బార్డిబాస్ రైల్వే లైన్ భారత్, నేపాల్ మధ్య క్రాస్ బోర్డర్ రైల్వే లైన్. ఇక్కడి నుంచి సింఫుల్ గా నేపాల్ కు వెళ్లొచ్చు.
⦿ పెట్రాపోల్ రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. బెంగాల్ లో అత్యంత రద్దీగా ఉండే సరిహద్దరు రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.
⦿ సింగాబాద్ రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో ఉంటుంది. ఇది భారత్- బంగ్లా క్రాస్ బార్డర్ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇక్కడ ఇరు దేశాలకు సంబంధించి వస్తువుల మార్పిడి జరుగుతుంది. బంగ్లా ప్రజలు భారత్ కు , భారతీయులు బంగ్లాదేశ్ కు వెళ్తుంటారు.
⦿ జోగ్బాని రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ బీహార్ లోని అరారియా జిల్లాలోలో ఉంటుంది. ఇది ఇండో- నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి కాలి నడకన నేపాల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది.
⦿ రాధికపూర్ రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ కూడా బెంగాల్ లోని నార్త్ దినాజ్ పూర్ జిల్లాలో ఉంటుంది. బంగ్లాదేశ్ కు సులభంగా వెళ్లేందు అవకాశం కల్పి
స్తుంది.
⦿ అట్టారీ రైల్వే స్టేషన్
అత్తారి రైల్వే స్టేషన్ పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉంటుంది. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ టెర్మినల్ స్టేషన్. 2019 నుంచి ఇక్కడి నుంచి రైల్వే ప్రయాణాలు నిలిచిపోయాయి.
Read Also: ఓడియమ్మ.. ఈ ఒక్క రైలు సంపాదనే అన్నికోట్లా? ఇది ఏ రూట్‌లో వెళ్తుందంటే…?