Formula E Race Case: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండ్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. గత కొన్ని వారాలుగా కీలక పరిణామాల మధ్య కేటీఆర్ ఎట్టకేలకు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. సుమారు ఏడు గంటలు పాటు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. ఏడు గంటల విచారణ అనంతరం.. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ బయటకు వచ్చారు. కేటీఆర్ విచారణపై కామెంట్స్ చేశారు.
ఏసీబీ అధికారుల వద్దనున్న నాలుగైదు ప్రశ్నలను తిప్పి తిప్పి 40 సార్లు అడిగారంటూ సెటైర్లు వేశారు. మళ్లీ ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదని.. కానీ ఏసీబీ ఎప్పుడు పిలిచినా మళ్లీ సహకరిస్తానంటూ మీడియా ముందు కేటీఆర్ మాట్లాడారు. ఆయన వెంట సీనియర్ లాయర్ రామచంద్రారావు ఉన్నారు. లైబ్రరీ రూం నుంచి విచారణను పరిశీలించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అరంగట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాదాపు 7 గంటలు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు. విచారణలో కేటీఆర్ స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.
కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు జేడీ రితిరాజ్, ఏఎస్సీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ కేటీఆర్ పై వరుసగా ప్రశ్నలు వేశారు. దాదాపు వరుసగా 35 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అనుమతుల్లేకుండా హెచ్ఎండీఏ నిధుల మళ్లింపు, ఈ రేస్ నిర్వహణకు కారణాలపై ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. అధికారుల అడిగిన ప్రశ్నలపై కేటీఆర్ తన అవగాహన మేరకు సమాధానమిచ్చినట్లు చెప్పారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించానని అన్నారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాసి ఇచ్చిన ప్రశ్నలనే అధికారులు పదేపదే అడిగారని పేర్కొన్నారు. కొత్తగా వాళ్లు అడిగిందేమీ లేదని చెప్పారు.
Also Read: IT instructor jobs: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో జాబ్స్.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..
గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్‌కు ఈ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అవి నిరూపించడానికి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఈ కేసు చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే కేటీఆర్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈ విచారణ జరగింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రాజెక్టులో నియమాలను ఉల్లంఘించి రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.