BigTV English

Train Tickets Europe: అక్కడ విమాన టికెట్ల ధరల కంటే రైలు టికెట్ల ధర ఎక్కువ.. విచిత్రంగా ఉందే!

Train Tickets Europe: అక్కడ విమాన టికెట్ల ధరల కంటే రైలు టికెట్ల ధర ఎక్కువ.. విచిత్రంగా ఉందే!

చాలా మంది తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణాన్ని కొనసాగించేందుకు ట్రైన్ జర్నీని ఎంచుకుంటారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వాళ్లు విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతారు. రైలుతో పోల్చితే అత్యంత వేగంగా ప్రయాణీకులకు గమ్య స్థానాలకు చేర్చడంలో విమానాలు ముందుంటాయి. సాధారణంగా రైలు టికెట్ ధరలతో పోల్చితే, విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే డిమాండ్ ను బట్టి విమాన ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ, రైళ్లలో ధరలు ఫిక్స్ డ్ గా ఉంటాయి. కొన్ని రైళ్లలో మాత్రమే టికెట్ ధరలు డైనమిక్ గా అంటే డిమాండ్ ను బట్టి మారుతూ ఉంటాయి. యూరప్ లో విమాన ఛార్జీలో పోల్చితే రైలు టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నట్లు తాజా స్టడీలో తేలింది. విమాన ధరల కంటే ఏకంగా 30 శాతం రైలు టికెట్ల ధరల ఎక్కువగా ఉండటం విశేషం.


విమాన ఛార్జీల కంటే రైలు ఛార్జీలు ఎక్కువ!

గ్రీన్‌ పీస్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. సుదూర రైళ్లు, విమానాల టికెట్ ధరను పోల్చి చూస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 112 దూరపు మార్గాల్లో రైలు ఛార్జీలు విమాన టిక్కెట్ల కంటే దాదాపు రెట్టింపు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని సందర్భాల్లో వేర్వేరు తేదీలలో 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయని స్టడీ తేల్చింది.  అనేక యూరోపియన్ దేశాలలో సుదూర ప్రయాణాలలో రైలు ఛార్జీలు విమాన టిక్కెట్ల కంటే 30 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గ్రీన్ పీస్ స్టడీలో తేలింది.


యూరప్ లో ప్రముఖ రైల్వే సంస్థ యూరోస్టార్‌ లో UK నుంచి యూరప్‌కు రైలు టికెట్ల ధరలు విమాన టికెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గ్రీన్ పీస్ స్టడీ వెల్లడించింది. స్పెయిన్‌ లో 71 శాతం మార్గాల్లో రైలు టికెట్లతో పోల్చితే విమాన టికెట్ల ధరలు చౌకగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నివేదిక ప్రకారం, విమానాలతో పోలిస్తే UK, బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో రైలు టికెట్లు అత్యంత ఖరీదైనవిగా ఉన్నట్లు తేలింది.

30 శాతం రైలు ధరలు ఎక్కువ!

ఆయా యూరప్ దేశాలలో చాలా రైళ్లకు సంబంధించి టికెట్ ధరలు డైనమిక్ గా ఉన్నట్లు తాజా స్టడీలో తేలింది. లండన్ నుంచి బార్సిలోనాకు చివరి నిమిషంలో బుక్ చేసుకున్న విమాన టికెట్లతో పోలిస్తే రైలు టికెట్ల ధరలు దాదాపు 29.6 రెట్లు పెరిగాయని  గ్రీన్ పీస్ నివేదిక వెల్లడించింది.

విమాన ధరల కంటే రైలు టికెట్ ధరలు ఎందుకు ఎక్కువ?

అత్యవసర ప్రయాణం చేయాలి అనుకున్న వాళ్లు విమానాలను ఎంచుకుంటారు. ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వెళ్లేందుకు ఎక్కువ మంది యూరోపియన్లు రైలు ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది లగ్జరీ ప్రయాణాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రైళ్లలో కల్పించే సౌకర్యాల కారణంగా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నట్లు గ్రీన్ పీస్ స్టడీ తేల్చింది. విమానాలలోనూ ఖరీదైన క్లాస్ లు ఉన్నప్పటికీ, రైళ్లలోనే ప్రయాణం చాలా కంఫర్ట్ గా ఉన్నట్లు ప్రయాణీకులు భావిస్తున్నారట. అందుకే, విమానా ఛార్జీల కంటే ఎక్కువ ఖర్చు చేసి మరీ రైళ్లలో ప్రయాణం చేస్తున్నారట.

Read Also: సమ్మర్ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు!

Related News

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Big Stories

×