Shruti Haasan : ఐపీఎల్ సీజన్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా చెన్నై ఇలాంటి చెత్త ప్రదర్శన కనబరచలేదు. అయితే ఈ సీజన్ లో చెన్నై ప్రదర్శన ఇలా ఉంటే.. ఇటీవల సచిన్ సినిమా రీ రిలీజ్ సమయంలో చెన్నైలోని ఓ థియేటర్ వద్ద ఆర్సీబీ, చెన్నై అభిమానులు గొడవ పెట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకున్నారు కూడా. మరోవైపు ఓ బుడ్డోడు ఆర్సీబీ జెర్సీ ధరించి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో ము**డ్డీ తుడుచుకుంటూ వీడియోని పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగిన సమయంలో హీరోయిన్ శృతిహాసన్ తన స్నేహితులతో కలిసి మ్యాచ్ తిలకించారు.
Also Read : Shruti Haasan: SRH దెబ్బకు… బోరున ఏడ్చేసిన హీరోయిన్ శృతి హాసన్
అయితే శృతి హాసన్ మెడలో ఎల్లో కలర్ లో పసుపు తాళిబొట్టు తరహాలో మనకు కనిపిస్తోంది. అసలు శృతిహాసన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంది.. ఎవ్వరినీ చేసుకుంది అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరగడం విశేషం. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ని పరిశీలించినట్టయితే.. తొలుత టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై తొలి బంతికే షమీ వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత ఆయుష్ మాత్రె 30, బ్రెవిస్ 42 పరుగులు చేశాడు. దీంతో చెన్నై 154 పరుగులకే ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్ 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. తొలి ఓవర్ లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మెల్లగా ఆడారు.
ఆ తరువాత హెడ్ కూడా ఔట్ కావడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. కొద్ది సేపటికే వచ్చిన క్లాసెన్ కూడా ఆశించిన ఇన్నింగ్స్ ఆడకపోవడంతో హైదరాబాద్ ఓడిపోతుందనుకున్న తరుణంలోనే ఇషాన్ కిషన్ 44 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో నితీష్ రెడ్డి, కమిందు మెండీస్ మెల్లగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక ఇదిలా ఉంటే.. చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలవ్వడంతో నటి శ్రుతి హాసన్ భావోద్వేగానికి లోనయ్యారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఆమె స్నేహితులతో కలిసి హాజరై మ్యాచ్‌ను తిలకించారు. ధోనీ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు మురిసిపోయింది. శృతి హాసన్ చివర్లో CSK ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్షణాలు కెమెరా లో చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు శృతిహాసన్ మెడలో ఎల్లో కలర్ లో పసుపు తాళిబొట్టు తరహాలో విజిల్ కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంత మంది తాళి బొట్టు అంటుండగా.. కాదు.. అది విజిల్ అని అభిమానులు తేల్చేసారు. మొత్తానికి శృతిహాసన్ మెడలో ఉన్నది తాళి బొట్టు కాదు.. విజిల్ అని తేటతెల్లం అయింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Women are the most beautiful creation of God. pic.twitter.com/TRsAJchIWB
— mufaddla parody (@mufaddl_parody) April 25, 2025