Train Tickets Booking Apps: ఇంతకు ముందు రైలు టికెట్లు తీసుకోవాలంటే రైల్వే స్టేషన్ కౌంటర్ లోనే తీసుకోవాల్సి వచ్చిది. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. రైలు టికెట్లు బుక్ చేసుకునే బోలెడు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. IRCTC Rail Connect, Paytm, ConfirmTkt, MakeMyTrip, Goibibo లాంటి యాప్స్ తో టికెట్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ లు ఇన్ స్టంట్ బుకింగ్, కన్ఫర్మేషన్ చెక్, సీట్ సెలక్షన్, PNR స్టేటస్ వంటి సౌకర్యాలను అందిస్తాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, కన్ఫర్మేషన్ ప్రిడిక్షన్స్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా సులభంగా, వేగంగా టికెట్లను పొందడంతో పాటు సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
రైల్వే టికెట్లు బుక్ చేసుకునే బెస్ట్ యాప్స్
⦿ IRCTC రైల్ కనెక్ట్ యాప్
భారతీయ రైల్వే సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్, యాప్ IRCTC రైల్ కనెక్ట్ యాప్. ఈ యాప్ ద్వారా వెంటనే టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు కన్ఫర్మేషన్ చెక్, సీటు సెలెక్షన్, రైలు షెడ్యూల్, PNR స్టేటస్ లాంటి సౌకర్యాలను పొందవచ్చు. ఈ యాప్ ఉపయోగించేందుకు ఈజీగా ఉంటుంది. అంతేకాదు, భద్రతపరంగా ఈ యాప్ చాలా బెస్ట్.
⦿Paytm
ఆన్ లైన్ చెల్లింపులు, ఆయా టికెట్ల బుకింగ్ కోసం ఉపయోగించే యాప్ లలో ముఖ్యమైనది పేటీఎం. Paytm యాప్ ద్వారా రైలు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్, కన్ఫర్మేషన్ ప్రిడిక్షన్ వంటి ఫీచర్లు ఈ యాప్ లో ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఈ వాలెట్ నుంచి నేరుగా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
⦿ ConfirmTkt
ConfirmTkt యాప్ ద్వారా కూడా ఈజీగా రైలు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా టికెట్ కన్ఫర్మేషన్ అంచనా వేసే అవకాశం ఉంటుంది. మీ టిక్కెట్ వెయిట్ లిస్ట్ లో ఉన్నట్లయితే, ఈ యాప్ మీ టికెట్ కన్ఫామ్ అవుతుందా? లేదా? అనే విషయంపై ఇంచుమించు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు తత్కాల్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ MakeMyTrip
MakeMyTrip ద్వారా బోలెడు సేవలను పొందే అవకాశం ఉంది. రైలు, విమానం, బస్సు, హోటల్ బుకింగ్‌లను ఒకే ప్లాట్ ఫారమ్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా పొందుతారు. ప్రయాణ బీమా సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది. ఈ యాప్ మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుంది.
⦿ Goibibo
రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రధాన యాప్ లలో Goibibo కూడా ఒకటి. ఇందులో మీరు రైలు షెడ్యూల్, PNR స్టేటస్ చెక్, కన్ఫర్మేషన్ ప్రిడిక్షన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. మీ బుకింగ్‌ను చౌక పొందే అవకాశం ఉంటుంది. ఇందులో బోలెడు ఆఫర్లు, క్యాష్ బ్యాక్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Also: రైలు టికెట్లపై కేంద్రం సబ్సిడీ, బాబోయ్.. అంత శాతం ఇస్తుందా?