BigTV English

Kanguva Trolls : పాస్‌లు అలాగే ఉన్నాయి సార్… పాన్ ఇండియా సక్సెస్ మీట్ ఎప్పుడు

Kanguva Trolls : పాస్‌లు అలాగే ఉన్నాయి సార్… పాన్ ఇండియా సక్సెస్ మీట్ ఎప్పుడు

Kanguva Trolls : ప్రతి దర్శకుడు కి తాను రాసుకున్న కథ మీద నమ్మకం ఉండడం అనేది సహజం. అలానే కొన్ని సందర్భాలలో ప్రొడ్యూసర్ కి కూడా ఆ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉండటం వల్లనే సినిమా మీద అన్ని డబ్బులు ఖర్చు పెడతారు. ఒక సినిమా కథ మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ ని ఎప్పుడు డిసైడ్ చేసేది ఆడియన్స్ మాత్రమే. ఆడియన్స్ కి ఎటువంటి సినిమా నచ్చుతుంది అని ఎవరు ఆలోచించలేరు. అలా ఆలోచించగలిగితే కేవలం హిట్ సినిమాలు మాత్రమే ఫిలిం ఇండస్ట్రీలో వస్తాయి. ఒకవేళ నిజంగా ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాలలో సినిమా మొదలుపెట్టినప్పుడే రాజమౌళి కథను చెప్పేస్తారు. ఎక్కువ అంచనాలు కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఆడియన్స్ కి ఇవ్వరు.


ఎస్ఎస్ రాజమౌళికి మిగతా దర్శకులకి ఉన్న తేడా అదే. రాజమౌళి బాహుబలి తీశాడని మనం ఆ స్థాయిలో తీయాలి అనుకోవటం తప్పు కాదు, కానీ రాజమౌళి కి ఉన్న క్లారిటీ మనకు కూడా ఉండాలి. లేదంటే సినిమా ఫలితంలో తేడా వచ్చిన తర్వాత పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్లు ఉంటుంది వ్యవహారం.

ప్రస్తుతం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో వచ్చిన కొన్ని సినిమాల పరిస్థితి అలానే ఉంది. పొన్నియన్ సెల్వన్, కంగువ సినిమాల ఫలితాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కంగువ విషయానికి వస్తే.. ఈ సినిమాని ఒక తమిళ్ బాహుబలి అన్నారు. రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది అన్నారు. ఈ మాటలు దర్శకుడు చెప్తే బాగానే ఉన్నా, ఈ మాటలను స్వయంగా నిర్మాత చెప్పడం అనేది ఇప్పుడు ట్రోల్ కి గురవుతుంది. అంతేకాకుండా ఈ సినిమా ఫంక్షన్ ఈవెంట్ లో కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా.


ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో మీ పాసెస్ అలానే ఉంచుకోండి. పాన్ ఇండియా సక్సెస్ మీట్ డిసెంబర్ లో ఖచ్చితంగా పెట్టబోతున్నాను. డేట్ చెప్తాను అప్పుడు ఇవే పాస్ స్ తో మీరు ఎంట్రీ ఇవ్వచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరిగితే అన్ని మీడియా ఛానల్స్ కూడా కవర్ చేసి లైవ్ ఇస్తాయి. కానీ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అలా కాకుండా ఆ ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఒక ప్రోగ్రాంలా ఎడిట్ చేసి మరి టెలికాస్ట్ అయ్యేలా చేస్తారు.

ఇక కంగువ ఈవెంట్ కి హాజరైన చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో నిర్మాత జ్ఞానవేల్ రాజాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కంగువ ఈవెంట్ కి సంబంధించిన పాసులు అలానే ఉన్నాయి. సక్సెస్ మీట్ ఎప్పుడో చెప్తే వచ్చి హాజరవుతాము అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అసలు ఏమీ లేని సినిమాకి ఇంత హడావిడి ఎందుకు చేశారో ఎవరికి అర్థం కాలేదు. ఆగడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ చెప్పినట్లు విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది అనే డైలాగ్ ఈ సినిమా విషయంలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×